2009 సంవత్సరాంతం వచ్చేస్తోంది. ఆంధ్ర రాష్ట్రం 2009 చూసిన విషాద / దారుణ సంఘటనలు బహుశా గత 25 సంవత్సరాలలో జరిగి ఉండవేమో.
మొట్టమొదట సత్యం సంఘటన తో ఆధ్ర ప్రతిష్ట మసకబారటం మొదలైంది.
ఆ తరువాత నాటి ముఖ్య మంత్రి వైయెస్ గారి మరణం మాహా విషాదం.
మరి కొన్ని రోజులకే అంధ్రా రాష్ట్రం ఎన్నడు కనీ వినీ ఎరుగని వరదలు.
ఈ వరదలనుండీ తేరుకొనే లోపే రాష్ట్ర విభజన సెగలు దాదాపు నెల రోజులుగా జన జీవనాన్ని స్థంబింపచేసాయి. ఉద్యమ కారులు విచ్చల విడిగా చెలరేగిపోయి ఆధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలను పూర్తిగా మంట కలిపారు. తాజాగా నిన్నటి ఓయూ ఘటన జరిగిన కొద్ది గంటలకే రాష్ట్ర ప్రధమ పౌరుడి వికృత చేష్టలు బయట పడి రాష్ట్ర ప్రజలందరినీ దాదాపు ధిగ్భ్రాంతికి గురి చేసాయి.
కనీసం నూతన సంవత్సరమైనా రాష్ట్ర ప్రజలకు ప్రశాంత వాతావరణం అందిస్తుందని ఆశిద్దాం..
Thursday, December 24, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
"నూతన సంవత్సరమైనా రాష్ట్ర ప్రజలకు ప్రశాంత వాతావరణం అందిస్తుందని ఆశిద్దాం".. అందరి ఆకాంక్ష అదే..కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ రావణ కాష్టం ఎన్నాళ్లు రగులుతుందో తెలియటం లేదు.
చాలా రోజుల తరువాత వ్రాస్తున్నట్లున్నారు!
Post a Comment