గత మ్యాచ్ లో ఓడిపోయినా ఆస్ట్రేలియా అంత సులభంగా పట్టు వదలదు. ఎప్పుడైతే గట్టి పోటీ ఎదురౌతుందో అప్పుడు ఆ జట్టు మరింత బలోపేతం అవుతుంది. ఇది ఆస్ట్రేలియా జట్టుకు ఆనవాయతీగా వస్తున్న ఆట తీరు. ఇదే ఆ జట్టు ని చాంపియన్సు ని చేసింది. మరో వైపు ఇండియా సీరిస్ లో ఆశలను సజీవం గా నిలిపేటందుకు గత మ్యాచ్ విజయం తోడ్పడింది. కానీ ఇప్పటికీ ఒక చిన్న తప్పు చేసినా సీరిస్ చేజారిపోయే ప్రమాదం వుంది. ఇక నుండీ ప్రతి మ్యాచ్ లోనూ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.
వదోదర మైదానం ఎల్లప్పుడు బ్యాట్స్ మెన్ కి స్వర్గధామమే. ఇక్కడి వికెట్ చాలా ఫ్లాట్ గా బ్యాట్స్ మెన్ కి పూర్తిగా సహకరించే వికెట్. ఇక్కడి అవుట్ ఫీల్డ్ కూడా మెరుపు వేగం తో వుంటుంది. బౌండరీలు కూడా కొద్దిగా చిన్నవే. రెండవ ఇన్నింగ్సు లో కొద్దిగా స్పిన్ కు సహకరించొచ్చు.
రిక్కి పాంటింగ్ ఈ మ్యాచ్ ని ఫైనల్స్ లాగా ఆడుతామని చెప్పాడు. తమ జట్టు కీలక సమయాలలో ఎంత గొప్పగా ఆడుతుందో ప్రపంచానికి మరోసారి చూపిస్తామని కూడా చెప్పాడు. ఆసిస్ డ్రెస్సింగ్ రూం ఇండియా ద్రెస్సింగ్ రూంకన్నా కన్న తక్కువ వత్తిడి లో వుంటుంది. హేడెన్, సిమండ్స్ ల అద్భుత ఫాం ఇండియా క్యాంప్ ని బాగా కలవరపెట్టెదే. ఇక బౌలింగు విభాగం లో లీ చక్కటి లైన్ తో బ్యాట్స్ మెన్ ని బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. లీ కి జాన్సన్ మంచి సహకారం అందిస్తుండటం తో ఆసిస్ పని మరింత సులువవుతోంది. ఇక ఫీల్డింగ్ విషయం లో ఆసిస్ ఇండియా మీద పూర్తి ఆధిపత్యం చూపిస్తోంది. ఇన్ని సానుకూలాంశలతో ఈ మ్యాచ్ లో ఆసిస్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది.
ఇండియా విషయానికొస్తే ఇప్పుడు వత్తీటంతా ఈ జట్టు మీదే. గత మ్యాచ్ లో మరో సారి సచి సౌరవ్ ల జంట ఓపెనింగు భాగస్వామ్యం తో మంచి పునాది వేసిన తీరు అభిమానుల లో మరిన్ని ఆశలు రేకెత్తిన్స్తోంది. ఇది సచిన్ కి 400 వ వండే కావటం తో ఈ మ్యాచ్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందిస్తే అవకాశన్ని అందిపుచ్చుకొని చెలరేగటానికి యువి , ధోని , ఊతప్ప రెడీగా వుంటారు. కానీ ఇంకా కొన్ని ఆంశాలలో మరింత మెరుగైన ప్రదఋశన ఇవ్వాల్సి వుంది. బౌలింగ్ విభాగం లో ఈ సీరిస్ అంతా విఫలమవుతూనే వుంది. 35 వ ఓవర్ లో బంతి ని మార్చిన తరువాత పూర్తిగా గతి తప్పుతుంది. ఇక ఫీల్డింగులో ఎంతో మెరుగు పడాల్సి వుంది.
గత మ్యాచ్ తో ఆసక్తికరం గా మారిన సీరిస్ ని ఈ మ్యాచ్ లో గెలుపుతో మరింత ఆసక్తి కరం గా మార్చటానికి భారత జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తుందనటం లో సందేహం లేదు. అదే సమయం లో ఆసిస్ ఈ మ్యాచ్ గెలవటం ద్వారా ఇండియా సీరిస్ గెలుపు ఆశల పై పూర్తిగా నీళ్ళు చల్లాలని వువ్విళ్ళురుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం వుదయం 9.00 కి ప్రారంభమవుతుంది.
నెట్ లో లైవ్ స్ట్రీమింగు కి
http://thinkersonmove.blogspot.com/2007/09/india-v-australia-7-odis-series-free.html
Wednesday, October 10, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment