Friday, March 23, 2012

ఓ వీకెండ్ రాత్రి ఏమి జరిగిందంటే........

శుక్రవారం ఉదయం 9.00

"నందీ కొండా వాగుల్లో నల్లా తిమ్మా నీడల్లో.. "
I-85 మీద 80 మైళ్ళ వేగం తో దూసుకుపోతున్న Infiniti కార్ Boss Sound System లో వస్తున్న పాట తో పాటు హం చేస్తూ హుషారు గా డ్రైవ్ చేస్తున్నా. వీకెండ్ వచ్చేస్తుందన్న ఆనందం కాబోలు.. మరో 15 మినిషాలలో ఆఫీస్ చేరి మైల్స్ చెక్ చేసా..కుళ్ళు జోకులు ఫార్వార్డ్స్ తప్ప పనికి వచ్చే మేటర్ పెద్దగా లేదు.. ఇంకా 8 గంటలు టైం ఎలా పాస్ చెయ్యాలి అని ఆలోచిస్తూ రమేష్ కి కమ్యూనికేటర్ లో Coffee? అని పింగ్ చేసా.."Lets Go" వెంటనే వచ్చింది రిప్లై.

రమేష్ వీకెండ్ మా రూం కి వచ్చేయ్, ఒక్కడినే ఆ భూత్ బంగళా ( మా ఇల్లు Condo, చుట్టూ చెట్లు, కాస్తా వూరికి దూరం గా విసిరేసినట్టు ఉంటుంది.. ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీస్ కి అనువు గా ఉంటుంది అని తీసుకున్నాము. మనోజ్ నా ఇంకో రూం మేట్, ప్రస్తుతం ఇండియా లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు) సరే లే సాయంత్రం ఆఫీస్ నుండి మీ ఇంటికి వెళ్దాం అన్నాడు.



ఇంతలో క్యాంటిన్ కి వచ్చాము. కాఫీ తిసుకొని అక్కడే కూర్చుని సొళ్ళేస్తున్నాము.. ఇంతలో ప్రసాద్ క్యాంటిన్ కి వచ్చాడు. ప్రసాద్ మా డామేజర్.. పక్కన ఎవరో కొత్త అమ్మాయి. మమ్ములని చూసి మా దగ్గరకు వచ్చి , " ఈ అమ్మాయి ఆఫ్షోర్ నుండి నిన్న వచ్చింది. కొత్త QA లీడ్ అని పరిచయం చేసాడు. ఆ అమ్మాయి ని చూడగానే ఏదో స్ట్రేంజ్ గా అనిపించింది. బహుశా ఆ కళ్ళు అనుకుంటా.. చంద్రముఖి లో రా రా పాట లో జ్యోతిక కళ్ళు లాగా ఉన్నాయి.




లేచి నిలబడి
"Hi I am akhil" అన్నా.. "తను చేయి కలిపి "I Am అశ్లేష " అంది. గోళ్ళ కు నైల్ పాలీష్, లిప్స్టిక్, ఐ షేడ్స్ అన్ని చాలా చాలా ఆడ్ కలర్స్ గా అనిపించాయి.. పేరు మరింత వింత గా అనిపించింది. మా ఇంటి దగ్గరే హాలిడే ఇన్ లో దిగింది అట. పరిచయాలు అయ్యాక ప్రసాద్ ఏదో మీటింగ్ ఉందని ఆ అమ్మాయిని అక్కడే వదిలి వెళ్ళాడు..మరో అరగంట మేము ముగ్గురం అక్కడే కూర్చొని మాట్లాడుకున్నాము....వెళ్ళబోయే ముందు "సాయంత్రం పార్టీ ఉంది, ప్రతి వీకెండ్ మన ఆఫీస్ వాళ్ళ గెట్ తుగెదర్ ఉంటుంది.." అని తనను ఇన్వైట్ చేసా.. తను రాదు అనే కాంఫిడెన్స్ తో..
"అలాగే వస్తాను , Can you pick me up?" అని అడిగింది. ఆ జవాబు వూహించక పోవటం తో ఒక నిమిషం నిశబ్ధం అక్కడ..
తేరుకొని అన్నా "సరే సాయంత్రం ఆఫీస్ నుండి నేరు గా వెళ్దాము .." అని..

**********************************************************************************************

సాయంత్రం 4.00

అందరికీ హ్యాపీ వీకెండ్ అని చెప్పి నేను, రమేష్, అశ్లేష ఆఫీస్ నుండి బయలు దేరే ముందు... ప్రసాద్ కి మిగిలిన కొలీగ్స్ కి పార్టీ గురించి గుర్తు చేసా.. ఓ ఇద్దరు వీకెండ్ కి ఎటో వెళ్తున్నాము కుదరదు అన్నారు.. ప్రసాద్ మరో ఇద్దరు మాత్రం 7.00 కి వస్తాము అన్నారు... ఆఫీసు బయట వచ్చి కార్ వైపు నడుస్తున్నాము, పార్కింగ్ ఏరియా అంతా దాదాపు నిర్మానుష్యం గా ఉంది. వీకెండ్ అవటం వల్లా అందరూ తొందరగా వెళ్ళి పోయారు..
వింటర్ కావటం వల్లా చీకటి వేగం గా ముసురుకుంటుంది.. చీకటి తో పాటే చలి కూడా వణికిస్తోంది. ఎప్పుడు గిలిగింతలు పెట్టే ఆ వాతావరణం ఆ రోజు ఎందుకో చాలా తేడా గా అనిపించింది.. ముగ్గురం పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము.. ఉన్నటుండి గాలి వేగం పెరిగింది.. ఆ గాలి తో పాటే లీలగా ఘల్ ఘల్ మంటూ గజ్జెల చప్పుడు... నాకేనా మిగతా ఇద్దరికీ కూడా అలా అనిపించిందా అని వాళ్ళ వైపు చూసాను.. వాళ్ళు ఏమీ పట్టనట్టూ మామూలు గా నడుస్తున్నారు. అశ్లేష మాత్రం నా వైపు వోరగా చూసి ఓ సర్కాస్టిక్ నవ్వు విసిరినట్టనిపించింది.. గాలి వేగం మరింత పెరిగిట్టుంది.. ఆ వేగం తో పాటే మరింత క్లియర్ గా గజ్జెల చప్పుడు.. అశ్లేష వైపు చూసా, గాజులు కానీ, కాళ్ళకు పట్టిలు లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని.. చీకటి లో ఏమీ కనిపించలేదు కానీ, మాడ్రన్ డ్రెస్ మీద కాళ్ళ పట్టీలు , గాజులు ఉండే అవకాశం లేదు, కానీ ఆ అమ్మాయి తెలుపు లెదర్ జాకెట్ చూస్తే ఎందుకో "నిను వీడని నీడను నేనే" అన్న పాట బ్యాక్గ్రౌండ్ తో నడుస్తున్న మాడ్రన్ డ్రెస్ దెయ్యం లాగా అనిపించి, వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మరింత చెవులు రిక్కించి విన్నా.. సందేహం లేదు ఎక్కడో గజ్జెల చప్పుడు.. కాస్తా భయం వేసింది..ఇంతలో కార్ దగ్గరకి చేరుకున్నాము..
వెనుక సీట్ లో అశ్లేష కూర్చుంది, నా పక్క సీట్ లో రమేష్ కూర్చున్నాడు.. ఆడియో ఆఫ్ చేసేసా కార్ లో మళ్ళీ ఏమైనా గజ్జెల శబ్దం వినిపిస్తుందేమో అని.. ఏమీ వినిపించలేదు.. కానీ పూర్తి నిశబ్దం.. ఆ నిశబ్దం మరింత భయంకరం గా అనిపించింది.. ఆ నిశబ్దాన్ని చీల్చుకుంటూ "అఖిల్ Can you Drop me back at Hotel after party? " అంది. Rear Mirror లో చూసి Sure అన్నా.. ఆ చీకటి లో తన కళ్ళు మరింత భయపెట్టాయి. తరువాతి 30 నిమిషాల డ్రైవ్ భారం గా గడిచింది. ఇల్లు చేరగానే పార్టీ కి అవసరమైన సరంజామా అంతా రెడీ చేసాము.. మరో గంట తరువాతా ముగ్గురం టివి ముందు చేరాము.. మెల్లగా మా డిస్కషన్ సినిమాల వైపు మళ్ళింది.. " ఏదైనా మూవీ చూద్దామా " అన్నాడు రమేష్.. "ఏవైనా హారర్ మూవీస్ ఉన్నాయా " అడిగింది అశ్లేష.. అదిరిపడి ఆమె వైపు చూసా.. ఎందుకో ఆ అమ్మాయి ప్రెజెన్స్ నన్ను చాలా అనీజీ కి గురి చేస్తుంది.. ఆ అమ్మాయి కి హారర్ మూవిస్ చాలా ఇష్టం అని అర్థం అయ్యే సరికి ఆ అనీజీనెస్ మరింత పెరిగి పోయింది. నా జవాబు పట్టించుకోకుండా నే రమేష్ "వాస్తు శాస్త్ర " సినిమా పెట్టాడు... నా భయాన్ని బయట పెట్టకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ , నా ఫోన్ తీసుకొనీ గేం ఆడటానికి ట్రై చేసా.. వోరగా ఆ అమ్మాయి చేతుల వైపు, కాళ్ళ వైపు చూసా, గాజులు కానీ గజ్జెలు కానీ ఏమీ లేవు..
సగం సినిమా అయ్యే సరికి ప్రసాద్ , ఇంకో ఇద్దరు కొలీగ్స్ వచ్చారు..

మెల్లగా పార్టీ మొదలైంది.. డ్రింక్స్ ఒక దాని తరువాత మరొక్కటి లోపలకి వెళ్తుంటే ఆ అమ్మాయి విషయం మరచిపోయా.."వాస్తు శాస్త్ర" సినిమా ప్రభావమేమో.. మెల్ల మెల్లగా రూం లో చర్చలు మళ్ళీ దెయ్యాల వైపు మళ్ళాయి.. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతున్నారు.. వూళ్ళలో విన్న కథలకు మరిన్ని వర్ణనలు జోడించి చెబుతున్నారు.. నాకు స్వతహాగా దెయ్యాల మీద నమ్మకం లేక పోయినా ఆ రోజు ఎందుకో భయం వేసింది..
మరో రెండు గంటలలో మెల్లగా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. మళ్ళీ నేను, రమేష్ , అశ్లేష మిగిలాము రూం లో..
5 నిమిషాలవగానే అశ్లేష "can you drop me at Hotel ? " అంది. ఆ అమ్మాయిని ఎంత తొందరగా వదిలించుకుందామా అని ఆలోచిస్తున్న నేను వెంటనే.. Lets gO.. అని కార్ కీస్ తీసుకొని బయలుదేరా..
తరువాతి 5 నిమిషాల డ్రైవ్ మౌనం గా గడచిపోయింది.. తనను హోటెల్ దగ్గర డ్రాప్ చేసి బై చెప్పి రిటర్న్ తీసుకున్నా..తీసుకుంటూ మరో సారి అశ్లేష వైపు చూసా.. రూం కి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఏదో మిస్ అయినట్టనిపించింది.. కానీ డ్రింక్స్ మత్తు నా ఆలోచనలను డామినేట్ చెయ్యటం తో ఆ విషయం మరచిపోయి ఇంటి దారి పట్టా...
లోకల్ రోడ్ కావటం వల్ల వేరే వెహికల్స్ ఏమీ లేవు.. రెండు వైపులా ఎత్తైన చెట్లు.... ఆకులు మొత్తం రాలిపోయిన ఆ చెట్లు ఎందుకో ఆ రోజు భయంకరం గా అనిపించాయి.. దానికి తోడు రూం లో ఇంత సేపు జరిగిన దెయ్యాల చర్చ నా భయాన్ని కాస్తా పెంచింది... తొందరగా ఇల్లు చేరటానికి వేగం కాస్తా పెంచా.. చుట్టూ చూడకుండా దృష్టి మొత్తం రోడ్ మీదే కేంద్రీకరించా.. ఉన్నట్టుండి వెనుక నుండి ఎవరో భుజం మీద చెయ్యేసినట్టనిపించింది. ఒక్కసారి వొళ్ళు జలదరించింది.. గట్టిగా అరవబోయి తమాయించుకున్నా.. మెల్లగా వెనక్కు తిరిగి చూసా.. ఎవరూ కనిపించలేదు..

ఒక క్షణం ఆలోచించా.. దెయ్యాలు గియ్యాలు ఏమీ లేవని మనసులో గట్టిగా అనుకొని మరింత వేగం పెంచా.. ఇంకో నిమిషలో ఇల్లు చేరా..
అప్పటికే రమేష్ ఒక బెడ్ రూం లో నిద్ర పోయినట్టున్నాడు.. నేను మరో బెడ్ రూం లో లైట్ ఆఫ్ చేసి డోర్ దగ్గర గా వేసి హాల్ లో కి వచ్చా.. , అప్పటికే డ్రింక్స్ మత్తు లో ఉండటం వల్ల ఆ బెడ్ రూం విండో కొద్దిగా వోపెన్ ఉండటం, డోర్ వెనుక ఒక ఆకారాన్ని గమనించలేదు.. !!!
హాల్ లో సోఫా మీద కూర్చొని లాప్టాప్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి తిరగేసి తరువాత ఏదో సినిమా స్టార్ట్ చేసా..

-----
అలా ఎంత సేపు గడచిందో, ఉన్నటుండి కరెంట్ పోయింది. అమెరికా లో కరెంట్ పోవటం ఏంటా అని చూస్తుండగానే మళ్ళీ అదే చప్పుడు....లీల గా ఎక్కడ నుండో గజ్జెల చప్పుడు. చాలా క్లియర్ గా ఎవరో నడుస్తున్నట్టు. రమేష్ ని పిలుద్దామని గట్టిగా పిలిచా.. గొంతు లో నుండి మాట పెగిలినట్టు లేదు. ఇంతలో ఆ గజ్జెల చప్పుడూ మరింత గట్టిగా వినిపించింది. ఆ చప్పుడు వైపు తిరిగి చూసే సరికి గాలిలో ఏదో తెల్లని ఆకారం.. సోఫా దిగి పరిగెడదామనుకొని సోఫా దిగబోయా.. దభ్ మని చప్పుడు..
-----
సోఫా మీద నుండి కింద పడ్డా.. ఉఫ్ఫ్.. ఇది కల అనిపించగానే తేరుకొని చూసా.. లాప్టాప్ లో సినిమా ఎప్పుడో అయిపోయినట్టుంది..మెల్లగా కింద నుండి లేచి లాప్టాప్ క్లోజ్ చేసి వాటర్ కోసం అని కిచెన్ వైపు వెళ్ళబోయి రెండో బెడ్ రూం వైపు చూసా.. డోర్ మెల్లగా వూగుతోంది.. బయట గాలి ఎక్కువగా ఉన్నట్టుంది.. ఏదో వింత శబ్ధం చేస్తుంది ఆ గాలి...అప్పుడు ఆ గాలి తో పాటు మళ్ళీ గజ్జెల చప్పుడు.. ఈ సారి డౌట్ లేదు.. ఇది కల కాదు,, చప్పుడు నిజం గానే వస్తుంది.. అది కూడా ఆ బెడ్ రూం నుండే.. కాళ్ళ లో వణుకు మొదలైంది.. దెబ్బకు మత్తు మొత్తం దిగిపోయింది.. కాసేపు ఏమి చెయ్యాలో తోచలేదు.. పరిగెత్తుకుంటూ వెళ్ళి రమేష్ ని నిద్ర లేపా.. విషయం అంతా విడమర్చి చెప్పా.. ఇద్దరం లేచి రెండో బెడ్ రూం దగ్గరికి వచ్చాము.. డోర్ కదిలినప్పుడు అంతా గజ్జెల చప్పుడు రావటం క్లియర్ గా తెలుస్తుంది.. అసలు ఈ బెడ్ రూం ని ఎప్పుడూ పెద్దగా వాడను.. ఈ రోజు అశ్లేష కాసేపు ఈ రూం లో ఉనట్టు గుర్తు.. ఆ ఆలోచన ఇంకా భయం వేసింది.. రమేష్ మాత్రం నావి అన్నీ సిల్లీ ఆలోచనలు అని కొట్టి పారేసి డోర్ తోసుకొని లోపలికి వెళ్ళి లైట్ వేసి డోర్ వెనుక చూసాడు.. చూసి పెద్దగా నవ్వుకుంటూ ఇదే నా నువ్వు అనుకుంటున్న ఆ దైయ్యం అని వెక్కిరించాడు.. అది చూసి నాకు పెద్ద రిలీఫ్.. ఇంతకీ అదేంటో తెలుసా.. :))

అది అశ్లేష వింటర్ లెదర్ జాకెట్ , ఆ జాకెట్ కి రెండు వైపులా కింద అడ్జెస్టింగ్ దారం లాంటిది ఉంది, దానికి ఫ్యాషనబుల్ గా చిన్ని బెల్స్ ఉన్నాయి. బాగా పరిశీలనగా చూస్తే తప్ప కనిపించని బెల్స్ అవి. సౌండ్ మాత్రం బాగా చేస్తున్నాయి.. వింతగా ఉన్న ఆ అమ్మాయి కళ్ళు, మరింత వింత కలర్ కాస్మెటిక్స్ నా లో ఏవో డౌట్స్ కలిగిస్తే, ఈ బెల్స్ ఆ అనుమానాన్ని పెను భూతం చేశాయన్నమాట.. :P

సాయంత్రం కార్ దగ్గరకి నడుస్తున్నప్పుడు , గాలి బలం గా వీచినప్పుడు ఆ లెదర్ జాకెట్ బెల్స్ వూగినట్టున్నాయి.. ఇక అశ్లేష సాయంత్రం ఈ రూంలో కి వచ్చినప్పుడు విండో వోపెన్ చేసినట్టుంది, ఇంకా తన లెదర్ జాకెట్ ని ఆ డోర్ వెనుక తగిలించి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళటం మరచిపోయినట్టుంది.. అందుకే తనని హోటెల్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు తను డిఫరెంట్ గా అనిపించింది.. ఇక విండో వోపెన్ చెయ్యటం వల్ల గాలి వీచినప్పుడు అంతా, ఆ డోర్ కదలటం, దానితో పాటు ఆ లెదర్ జాకెట్ కి వున్న బెల్స్ సౌండ్ గజ్జెల సౌండ్ లాగా అనిపించి నేను భయపడటం అంతా చాలా సిల్లీ గా అనిపించి నేనూ గట్టిగా నవ్వేసా...

(ఈ రోజు ఆఫీస్ లో ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ చెప్పిన సరదా సన్నివేశం నుండి పుట్టిన కథ ఇది.. )