రాత్రి పది గంటలైంది, ఇంకా ఆఫీసులో ఎడతెగని పని తో కుస్తీ పడుతూ, రాత్రికి ఏమి తినాలి అని ఆలోచిస్తున్నా. ఎంతకీ రాస్తున్న డాక్యుమెంటు పూర్తి కాకపోవటం తో, పనికి పుల్స్టాప్ పెట్టి, ఇంటికి బయలుదేరా.. శీతాకాలపు మంచు నల్లటి చీకటి మీద కప్పిన తెల్ల దుప్పటి లాగా కనిపిస్తోంది.. రోడ్లన్నీ నిర్మానుష్యం గా ఉన్నాఇ. గంచిబౌలి నుండి కారు లో మియాపూర్ వైపు వెళ్ళుతున్నా.. రైల్వే గేటు పడకూడదని మనసులో గుర్తు కి వచ్చిన దేవుళ్ళందర్నీ మొక్కుకుంటూ కారు వేగం పెంచ్చా.. గేటు ఇంకా 2 కిలో మీటరులు ఉంది అనగా రైలు కూత వినిపించ్చింది.. హమ్మయ్య, గేటు దగ్గరికి వెళ్ళేసరికి రైలు వెళ్ళీపోయి గేటు ఒపెను ఉంటుంది అని సంతోషించా.. వూహించినట్టూగానే గేటు తీసి ఉంది. ట్రాక్ దగ్గరకి రాగానే కారు వేగం తగ్గించి ట్రాకు దాట బోతూ, ట్రాకు పక్కన పడి వున్నా ఆకారాన్ని చూసి వులికి పడ్డా.. వెంటనే కారు పక్కన ఆపి, ఆ ఆకారం దగ్గరకు వెళ్ళా.. ఆకారం చుట్టూ రక్తం..మొహం కనిపించట్లా..దాదాపు నా వయసే ఉంటుంది. చూడగానే అర్థం అయింది,, ఇప్పుడే వెళ్ళిన రైలు కింద పడ్డాడని.. అంత చలి లో కూడా నా నుదిటి మీద చిరు చెమటలు పట్టడం తెలుస్తోంది.. ఇంతలో ఆ ఆకారం చేతిలో మడత పెట్టిన తెల్లటి కవరు కనిపించింది. నెత్తుటి మరకలంటిన ఆ కవరుకి జాగ్రత్తగా తీసుకుని చూసా.. దాని పైన ఉన్నా ' అప్రైజల్ లెటర్ ' అన్న పదాలు చూసి కొద్దిగా ఆశ్చర్య పోయా.. భయం తో కూడిన కుతూహలం తో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామని వెంటలే ఆ లెటర్ ని తెరిచా.. మెడలోని ఏదో కంపెనీ బాడ్జ్ , ఈ లెటరు చూసి నాలాగే సాఫ్ట్వేరు ఇంజనీరు అని గుర్తు పట్టా.. లెటరు తెరవగానే అప్రైజల్ వివరాలన్నీ పంచ రంగులలో కనిపించాయి.. ఒక్క సారి గా తల మీద కొన్ని పిడుగులు పడ్డటైయింది.. ఆ లెటర్ లో అప్రైజల్ అమౌంట్ చూడగానే..ఆ పెరిగిన మొత్తం నా చేతిలో ఉన్న లెటరు విలువ కూడా చేయదు.. ఒక్క సారి గా ఆ వ్యక్తి మీద అమితమైన జాలి వేసింది.. ఇంకా అది ఆత్మ హత్యే అని రూడీ చేసుకున్నాను.. ఒక తోటి సాఫ్ట్వేరు ఇంజినీరు కి పట్టిన గతి చూసి మనసంతా వికలమైపోయింది.. భారమైన హ్రుదయం తో అక్కడ నిలబడి ఆలోచిస్తున్నా, ఆ వ్యక్తి ఎంత పెద్ద షాక్ తిని ఉంటాడో ఆ లెటర్ చూడగానే అని. ఆ వ్యక్తికి మనసులో నే అంజలి ఘాటిస్తూ.. లెటర్ లో ని పేరు చూశా.. ఒక్క సారిగా నా చేతులు మంచు గడ్డలైపోయాయి ఆ పేరు చూడగానే.. ఎంత యాద్రుచ్చికం కాక పోతే అతని పేరు నా పేరు (ఇంటిపేరు తో సహా ) ఒక్కటే అవుతాయి అనుకుంటూ ఆ వ్యక్తిని వెల్లెకిలా తిప్పా మొహం చూద్దామని, చూడగానే ఒక నిమిషం పూర్తిగా చలనం లేకుండా బిగుసుకు పోయాను.. నా కాళ్ళు చేతులు కదలటం మానేశాయి.. పేర్లు ఒక్కటే కాదు, అచ్చుగుద్దినట్లు మొత్తం నాపోలికలే.. ఉన్న కాస్తా కుతూహలం పూర్తిగా పోయి, విపరీతమైన భయం తొ మరింత దీక్షగా చూసాను.. ఒకే పేరు, ఒకే కంపెనీ, ఒకే శరీరం !!!!!!!!???!!!!!!!!!!!
అక్కడ చనిపోయ్ పడుంది నేనే !!!!!!!!!!!
నేను అలా పూర్తి షాక్ లో ఉండగానే ఎవరో వెనక భుజం మీద తట్టినట్లైయింది....... .......
భళ్ళ్..
టేబిల్ పైన నా చేతి పక్కనే ఉన్న అందమైన గాజు బొమ్మ చేయి తగిలి కింద పడి పగిలిపోయింది..ఆ శబ్దం తో ఒక్క సారి భయంకరమైన కలలో నుండి బయట వచ్చి వెనకకు తిరిగి చూడగానే యముడిలా మా మానేజరు నిలబడి ఉన్న్నాడు.. నా భుజం తడుతూ, ' Wake up man.. Come to meeting room, I have your appraisal letter ready.... ' అంటున్నాడు..
గమనిక : ఎప్పుడో 2003 లో నాకు వచ్చిన ఒక మైల్ ఫార్వార్డ్ కి అనువాదం ఇది. ఆ మధ్య ఎప్పుడో ఒక సారి మా ఆఫీసు వాళ్ళతో కూర్చుని కంపెని గురించి అప్రైజల్ గురించి మాట్లాడుకుంటుంటే ఇది గుర్తు వచ్చి ఆ మైలు కోసం వెతికా.. ఎక్కడా కనిపించలేదు. సరే నని నాకు గుర్తు వున్నంతవరకు అనువదించి.. మిగతా నా సొంత వూహాగానాలు జోడించి రాసా..
Sunday, July 22, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
చాల బాగుంది :)
chala bavundi.. entho trill ga vundetattu rasaru
Post a Comment