Monday, July 30, 2007

దా.. దా... దా.. శంకర్ దాదా

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా మా 'మెగాస్టార్ ' నటించి న సినిమా మొత్తానికి మొన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూడటానికి బాగానే కష్ట పడాల్సి వచ్చింది. ఇండియా లో ఐతే మొదటి ఫ్యాన్స్ షో మిస్ కాకుండా చూసే నేను ఇ ప్పుడూ కూడా మొదటి షో మిస్ కాకూడాదనే వుద్దేశం తో మా వూళ్ళో సినిమా వెయ్యకపోయినా పక్క వూళ్ళో (ఓ పాతిక మైళ్ళు దూరం ) చూడాలని డిసైడు అయ్యా . గురువారం సాయంత్రం 8.00 కి షో అని ఐడిల్ బ్రైన్ లో చూసి వేంటనే ఆలైన్ లో బుక్ చేసుకున్నా టికెట్లు.. తీరా చూస్తే బాక్సు రాలేదని శుక్రవారం సాయంత్రం 7.00 కి మార్చారు షొ.. మొదటి రోజు సినిమా చూడలేదని ఒకింత నిరుత్సాహపడినా తరువాతి రోజు ఎలాగూ వుంది కదాని సర్ధి చెప్పుకున్నా.. ఇక శుక్రవారం మధ్యానం నుడే హడావుడీ పడుతూ థియేటరు కి డైరెక్షన్లు గట్రా అన్ని తీసుకున్నా.. సినిమా 7.00 కి అంటే నేను 5.30 కే బయలుదేరా.. తొదరగా వెళ్ళీ అక్కడ జరిగే హంగామా చూద్దామని.. అలా ఇంటి నుండి బయలుదేరి ఓ నాలుగు మైళ్ళూ ప్రయానించానో లేదో... ట్రాఫిక్కు. మరో 20 నిమిషాలు గడచినా ఒక మైలు కూడా ముందుకు వెళ్ళలేదు... అయ్యో సినిమా లో బాసు ఇంట్రడక్షను సీను మిస్సవుతానేమో అని టెన్షను ఒక పక్కా.. మరో 5 నిమిషాలకు ఇంకొద్దిగా ముదుకు కదినింది ట్రాఫిక్కు.. తీరా అక్కడ చూస్తే రోడ్డు అంతా పోలీసు కార్లు, ఫైర్ ఇంజిన్లతో బ్లాకు చేసి ట్రాఫిక్కు డైవర్టు చేస్తున్నారు. అసలే ఆ రూట్లు అంతా కొత్త, ఇంకా డైరెక్షన్లు పుల్లు పోకుండా ఫాలో అవటం తప్పా మనకి ఏమీ తెలియదు.. అటువంటిది ఏ రోడ్డూ లో వెళ్ళితే ఏ మౌతుందో ఎక్కడ తేలుతామో అని టెన్షను.. దానికి తోడూ కారు లో గ్యాసు కూడా ఎక్కువ లేదు. ఇక వెనక్కు తిరిగి వెళ్ళి పోదామనుకున్నా.. కానీ ఇప్పుడు చూడకపోతే మళ్ళీ ఎప్పుడూ కుదురుతుందో ఏమో అని ఏదితే అది అయ్యిందని ముందుకు సాగిపోయా.. అలా 20 నిమిషాలు ఏవేవో రోడ్లలో వెళ్ళుతున్నా.. ఎంతసేపటికీ నా మ్యాప్ లో వున్న ఒక్క రోడ్డూ పేరూ రాదే.. !! ఇంకో పది నిమిషాలు కష్టపడితే చివరికి మా మ్యాపు లో వున్న ఒక రోడ్డూ కనిపించింది. ఇక రెట్టించిన వుత్స్యాహం తో మొత్తానికి 7.10 కి థియేటర్ చేరా.. ఇంకో ఐదు నిమిషాలలో హాల్ లోపల అడుగు పెట్టా.. అప్పటికే సినిమా టాక్ తెలియటం వల్లనో ఏమో హాలు పారిక శాతం ఖాలీ గా నే వుండీ పోయింది. 'చిరుతకే అయ్య..' అని శ్రికాంత్ డైలాగు విని గాట్టిగా ఒక విజిల్ వేసి సీటు లో కూర్చున్నా.. అప్పుడే బాసు ఎంట్రీ ఇచ్చాడు.. ఇంకో రెండు విజిల్స్ వదిలి చూస్తున్నా సినిమాని..
అలా వుత్సాహం గా ప్రారంభమైనా సినిమా ఇంటర్వెల్ కి వచ్చేసరికే ఏదో తెలియని వెలితి. కథ బాగానే వుంది , చిరు ఇరగదీసాడు.. అయినా ఎదో మిస్సింగు.. ఇక రెండొ హాఫ్ కూడా పూర్తయ్యేసరికి ఒక చిరు అభిమానిగా పూర్తిగా నిరాశ పడిపోయాను.

నెగటివ్ పాయింట్లు
1. డైరెక్షన్ లో ఎక్కడా వరైటి అనేది లేదు. సినిమా ని హడావిడిగా చుట్టేసారనేది ప్రతి ఫ్రెము లో ను తెలుస్తుంది.
2. చాలా సీన్లలో ఎడిటింగు సరిగా లేదు. ఇక లైటింగు ఎఫెక్టులైతే దారుణం.
3. వున్న ఒకటి రెండు ఫైట్లు కూడా మరీ సింపుల్ గా తేల్చేయటం.
4. రెండు పాటలు మినహా చిరు నుండి ఆశించిన డ్యాన్సు మూవ్మెంట్స్ లేకపోవటం. ఆ రెండు పాటల డ్యాన్సులు కూడా మరీ గొప్పగా లేక పోవటం
5. కరిష్మా కోటక్ మరీ దారుణం గా వుంది. హీరోయిను కి వుండాల్సిన లక్షణాలు ఏమీ లేవు. అసలు తనకు ఒక డ్యాన్సు స్టెప్పు కూడా లేదు. చిరు తోటి హీరోయిను అంటే అతని వేగం తో కనీసం పోటీ పడే వాళ్ళు వుండాలి.
6. వినోదం పాళ్ళు తగ్గటం

పాజిటివ్ పాయింట్స్
1. యధావిధిగా చిరు అద్భుత నటన
2. పవన్ , అర్జున్ , రవితేజ ల గెస్ట్ అప్పియరెన్సు
3. కథ.
మొత్తం మీద చూస్తే అభిమానులను నిరాశ పరిచే చిత్రం. ఫ్యామిలీ ఆడియెన్సుని కొద్దిగా అలరించగలిగే చిత్రం.
సినిమా రిలీజ్ కి ముందే విన్న చాలా విషయాలు నిజమైయ్యాయి.
చిరు బ్యాక్ పైన్ వల్లా సరిగ్గా స్టెప్పులు వెయ్యలేక పాయాడని ,
హీరోఇన్ను కి డ్యాన్సు మూవ్మెంట్స్ చెప్పలేక ప్రభుదేవా చేతులెత్తేసాడని ,
నిర్మాతలు పెద్దగా ఖర్చు పెట్టకుండా సింపుల్ గా తీశారని ,
ఇంకా చిరు 'చిరుత ' మీద చూపిన శ్రద్ద ఈ సినిమా మీద చూపలేదని..
సినిమా చూసిన తరువాత ఇందులో ప్రతి ఒక్కటీ నిజం అని అనిపిస్తుంది..

3 comments:

Anonymous said...

మస్టారు ! మీకు సినిమా చూడొద్దు అని శకునాలు ముందే సూచించాయి అయినా లెక్కచేయకుండా వెళ్ళారు తలనొప్పి " కొని " తెచ్చుకున్నారు

Anonymous said...

enTi chiru iragadeesindi? Naakaithe chiru action assalu nachaledu. Anavasaramaina over action chesinattundi. mee fans ki alaa chestene nachutundemo. adee kaaka baagaa laavayyadu. asalu chiru steps veyyakundaa cinemaa tiyyaledaa? paataku steps avasaramaa ledaa ani alochinchakundaa, prati paataku steps iragadeeyaalanukunte, ilaane tayaravutundi cinemaa. nenu inko gossip vinnanu. oka shot ni prabhudeva retake chebite, "inta emotion mallee raadu. shot ok chesey" annadanta mee chiru. ee maata nijamani cinema lo vunna prati frame chebutundi. inka cheppinattu vinakapote, director ki emi interest vastundi. asalu prabhudeva teesina last 3 movies enta baagaa teesaadu? (including tamil Pikiri). asalu ee cinemaa chooste enduku teestunnanu raa baabu, anukuntu teestunnattundi. Inka naa drushtilo chiranjeevi cinemalu teeyatam maaneyyali. lekapote fans ki tappa vere vallaki tickets ammakoodadu. maa laanti vaallu anavasaram gaa bali kaakundaa batiki potaaru.

Unknown said...

మీ బ్లాగ్ చాలా బావుంది. నాకు తెలుగు లో బ్లోగ్ మొదలు పెడదామని ఉంది. తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu కన్నా మంచి సాఫ్ట్‌వేర్ ఉంటే చెప్ప్పండి. అంటే ఇది చాలా బావుంది కానీ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా.