Thursday, July 10, 2008
'సింబ్లీ' సిల్లీ జ్ఞాపకం ....
ఇది నేను +1 చదివేటప్పుడు. మాకు అప్పుడే కొత్తగా ఫిజిక్స్ , కెమిస్ట్రి కి ఇద్దరు కేరళ లేడీ టీచర్లు వచ్చారు. వాళ్ళు వచ్చిన మొదట్లో వాళ్ళ ఇంగ్లీషు సరిగా అర్థమైయేది కాదు. సింబ్లీ ( simply ) , వోళియం ( Volume ) లాంటి పదాలతో మొదటి కొన్ని రోజులు పాఠాలు అసలు అర్థం అయ్యేవి కావు. ఒక రోజు మా కెమిస్ట్రి మేడం స్లిప్ టెస్ట్ పెడుతోంది. స్లిప్ టెస్ట్ అంటే టీచరు ప్రశ్నలు చెబుతుంటే మేము ప్రశ్నలు పేపర్ మీద రాసుకోవాలి. ఆ తరువాత దూరం దూరం గా కూర్చొనిజవాబులు రాయాలి. మేడం చెబుతున్న ప్రశ్నలలో ఒకటి What is Dry Ice ? And Why is it so Called ? కేరళా వాళ్ళూ 'కా' ని 'కో' అని పలుకుతారు కదా.. సో మా వాళ్ళు అందరూ ప్రశ్నని ఇలా రాసుకున్నారు. What is Dry Ice? And Why is it so Cold ? ఇక ప్రశ్నలు అయిపోగానే జవాబులు రాసి పేపర్లు మేడం కి ఇచ్చేశాము.స్లిప్ టెస్ట్ అయిపోగానే మా ఫ్రెండ్స్ తో ఒక్కో దాని జవాబు చర్చించుకుంటున్నాము. (అప్పట్లో ఏ పరీక్ష కానీ అయిపోగానే జవాబులు తోటి వాళ్లతో చచించి, మనం రాసినవి కరెక్టే అని ప్రూవ్ చేసుకోవటం అనేది ఓ తుత్తి , ఇంకా పోటీ తత్వం కూడాను ) ఈ ప్రశ్న రాగానే మా ఫ్రెండ్ ఒకతను చెప్పిన జవాబు... డ్రై ఐస్ అంటే చెప్పి అది ఐస్ కాబట్టి మరీ చల్లగా వుంటుంది అని చెప్పాడు. అంతే అది వినగానే మేమంతా పడి పడి నవ్వాము. ఆ తరువాత విషయం క్లాస్ లో చెబితే చాలా మంది అవును అది కరెక్టే కదా.. 'ఐస్ కాబట్టి అది మరీ చల్లగా వుంటుంది అని ' అని, వాళ్ళంతా అదే రాశామని చెప్పారు. సరే అని వాళ్లకు విడమరచి చెప్పాము.. ప్రశ్న 'why is so called ?'.. అది 'cold' కాదు అని. (డ్రై ఐస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఐస్ రూపం లో. దానిని డ్రై ఐస్ అని ఎందుకంటారంటే ఇది కరిగిన తరువాత ద్రవ పధార్థం లా కాకుండా నేరుగా కార్బన్ డైఆక్సైడ్ వాయు పధార్థం గా మారుతుంది కాబట్టి) ఆ తరువాత సమాధానాలు చదివిన మేడం గారు కూడా తెగ నవ్వు కున్నారు లెండి..
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
సింబ్లీ సిల్లీ గా ఉంది.. :)
మీ బ్లాగ్ చాలా స్లో గా లోడవుతోంది... ఒకసారి గమనించగలరు..
జి౦బ్లి ...నైస్ జొక్.....
బాగుంది. ఆ టీచర్లు నాకూ తెలుసుగనక ఇంకా బాగా అర్థమయ్యింది.
ఈ ఆంగ్లం పలికే విధానం ఒక్కో భారతీయ భాష వారికీ ఒక్కో విధానముంటుంది. తెలుగువాళ్ళం M, N అక్షరాల్ని "యమ్, యన్" అని పలుకుతాం. కానీ వాటిని కనీసం "ఎమ్, ఎన్" అని పలకాలి. ఇక హిందీ వాళ్ళు spoon, school ని "సపూన్, సకూల్" అని పలుకుతారు.
వినడానికి సరదాగానే ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలాంటి సమస్యలోస్తే బాగా గుర్తుండి పోతుంది.
మీ బ్లాగు మొదటి పేజీ (http://npulipati.blogspot.com/) బానే లోడవుతూంది. ఏదైనా జాబు పేజీకి వెళ్ళబోయినపుడు మాత్రమే పేజీ పూర్తిగా లోడు కావడం లేదు. గూగుల్ ఎనలిటిక్సు దగ్గరో, తెనెగూడు దగ్గరో ఆగి పోతోంది.
@ మేధ గారు.. ధన్యవాదాలు అండి.. పేజీలు స్లో అవటం గమనించాను. ఈ వీకెండ్ సరి చేస్తాను.
@ శంకర్ గారు ధన్యవాదాలు
@ మహేష్ - ఆ హార్స్లీహిల్స్ రోజులే వేరు.. నువ్వు అక్కడి డేస్ మీద ఒక టపా రాస్తానన్నావు.. వీలు చూసుకొని రాసేయ్.. వైటింగిక్కడ..
@ చదువరి - ధన్యవాదాలు అండి. ఒకటి రెండు రోజులలో సరిదిద్దుతాను.
కొన్ని పదాలని మన దక్షిణాది రాష్ట్రాల వారు ఎలా ఎలా పలుకుతారో ఎవరైనా సరదాగా ఒక పోష్టు రాస్తే చూడాలని ఉంది. మహెష్ గారూ ప్రయత్నించచ్చుగా మీకు నాలుగైదు భాషలపై పట్టు ఉంది కదా!
బొల్లోజు బాబా
నీ జ్ఞాపకాలన్నీ సరదాగా ఉంటాయి :)
బ్లాగు కొత్తరూపం బావుంది.. ఇప్పుడే చూస్తున్నా..
Simbly nice.
Post a Comment