Monday, July 14, 2008

సిల్వర్ స్క్రీన్ సుబ్బు - సినిమా రాజకీయాలు

సిల్వర్ స్క్రీన్ సుబ్బు గత వారం గా దిగులు గా కూర్చున్నాడు. కోడి కాలు, స్కాచు చుక్కా కూడా ముట్టలేనత దిగులు లో మునిగిపోయాడు. రాష్ట్రం లో దేశం లో రాజకీయాలన్ని ఎదురు తిరిగి గిలగిలలాడుతున్న చంద్రబాబు లాగా గిలగిలలాడిపోతున్నాడు సుబ్బు.
ఈ దిగులు కి కారణం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెన్నక్కు వెళ్ళాల్సిందే..
లాన్ లాంగ్ అగో సో లాంగ్ అగో.. ఐ డోంట్ నో హౌ లాంగ్ అగో.. ఈ సుబ్బు గారు వురఫ్ సుబ్బయ్య చిన్నప్పుడు షూల్ ఎగొట్టి మరి సినిమాలు తెగ చూసేవాడు. అమ్మా నాన్న " ఒరే సుబ్బిగా ఈ సినిమాలు మనకు కూడెడతాయా, గూడు చూపిస్తాయా .. మేమెలాగూ చదువులేక పొలం నమ్ముకొని బతుకుతున్నాము. నువ్వైనా బుద్దిగా చదువుకోరా " అని తెగ పోరే వారు.. దానికి సుబ్బిగాడు ఎంత సదూకున్నా వుద్యోగం తో సాలీ సలని బతుకులేకదే అమ్మా.. అందుకే నేను పెద్దైయ్యాక సినిమా డైరెక్టర్ అవుతా అనేవోడు. అలా నెలకు మూడు క్లాసులు వారానికి 6 సినిమాలు లాగా గడిపేసాడు.. స్కూలు నుండి కాలేజీ కి వచ్చేసరికి సుబ్బు గాడి సినిమా పిచ్చి రోజు రోజుకి పెరుగుతున్న వైయెస్ అక్రమార్జన లాగా పెరిగిపోయింది.
ఫిలిం నగర్ చుట్టూ చక్కర్లు కొడుతు ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకుంటారేమో అని షూస్ అరిగేలా తిరుగుతున్నా రొజుల్లో అవుటర్ రింగు రోడ్డు యొక్క పదివేల తొమ్మిదో మలుపు వాళ్ళ పొలాన్ని రాసుకుంటూ పోవటం తో హటాత్తుగా కోటీశ్వరుడైపోయాడు, ఒక్కసారిగా అంత డబ్బులొచ్చి పడటం తో ఏమి చెయ్యాలో తోచక తొక్కలోది వీళ్ళ వెనక తిరగటం ఎందుకు తనే ఒక సినిమా తీసిపడేస్తే పోలా అని వెంటనే సినిమా కి శ్రీకారం చుట్టేశాడు.
స్వతహాగా పూరీ జగన్నాధ్ అభిమాని అవటం వల్లా టైటిల్ వెరైటి గా వుండాలని 'నసగాడు ' అనే పేరు ' వీడికి దురదెక్కువ ' అనే ట్యాగ్ లైన్ తో కొత్త వాళ్ళతో యూత్, ఫ్యాక్షన్ లవ్ స్టోరీ తొ తీసిపడేశాడు. సుబ్బిగారి డైరెక్షన్ లాజిక్కులకందగ పోయినా టేకింగు , టైటిలు వెరైటీ గా వుందని యూత్ సినిమా ని సూపర్ హిట్ చేసి పడేశారు. అలా మొదటి సినిమా నే సూపర్ హిట్ అవటం తో వెంటనే ఇక తన జీవితం అంతా ఈ వెండి తెర కే అంకితం అనుకొని ప్రాస కోసం ప్రాణమిచ్చే సుబ్బయ్య సిల్వర్ స్క్రీన్ సుబ్బు అయిపోయాడు. పేరు మార్చుకున్న వేళా విశేషమో చేతిలో డబ్బుల మహత్యమో యుత్ హీరోలంత సుబ్బు వెంట పడ్డారు, నెక్స్ట్ నా సినిమా నా సినిమా అని. ఎస్ ఎస్ సుబ్బు అప్పుడే ఎదుగుతున్న యూత్ హీరో ని పెట్టి కథ గురించి ఆలొచించకుండా టాలీవుడ్ లో అతి భారీ బడ్జెట్ సినిమా ప్రారంభించెసాడు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడాదని మొదటి సినిమా కన్నా గొప్ప టైటిల్ కావాలని ' శనిగాడు ' అనే పేరు ని, 'పట్టుకుంటే వదలడు ' అనే ట్యాగ్ లైన్ తో అనౌన్స్ చెసేశాడు. మొత్తానికి సినిమా ప్రారంభం అయ్యింది. కథ అంటు పెద్దగా లేక పోవటం తో ఎవొ ఒకటి అరా సీన్లు షూట్ చేస్తూ వస్తున్నాడు. రోజులు గడిచే కొద్దీ హీరో నాన్న, బాబాయ్, పిన్ని, అక్క , చెల్లి, బావా, మామ, వేలు విడిచిన మేనమామ, కాలు విడిచిన మేనత్త , కాలు వేలు రెండూ విడిచిన బీరకాయ పీచు చుట్టం, నిన్న కాక మొన్న పుట్టిన మేనకోడలు ఇలా ఒకరి తరువాత ఒక్కరు వచ్చి ఎవరికి వాళ్ళు డైరెక్షన్ లో వేలెట్టడం, స్టొరి ని మార్చటం తొ , అసలు లేని కథ ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు కన్నా ఎక్కువ సార్లు మారిపోయింది. రీ షూట్ ల మీద రీ ష్ట్లు చెయ్యటం తో దెబ్బకు ఎస్ ఎస్ సుబ్బు కోట్లన్ని కరిగిపోయాయి. మొత్తానికి ఫైనాన్సర్ల సహాయం తో సినిమా పూర్తయ్యిందని పించుకున్నాడు. అలా 'శనిగాడు ' సినిమా విడుదలకి సిద్దం అయ్యింది. విడుదల రోజు ప్రేక్షకులు ఈ శనిగాడు ఎప్పుడు వదులుతాడా అనే టాక్ తో థియేటర్ల నుండి పారిపోయారు. పెద్ద సినిమా కి మొదటి రోజు డివైడ్ టాక్ మామూలే కదా అని సర్థి చెప్పుకున్నాడు. కానీ రెండో రోజు, మూడో రోజు గడచే కొద్దీ శనిగాడు సినిమా హాల్ దగ్గర జనాలు కూడా కనపడలేదు.
ఇదీ మన ఎస్ ఎస్ సుబ్బు గారి దిగులుకి కారణం. స్నేహితుల బలవంతం మీద బీరు - మీరు, బూందీ - బ్రాందీ (ఈ మధ్యనే వచ్చిన ఒక సినిమా లో డైలాగ్ ఇది, బాగా వుందని వాడుకున్నా ) ప్రోగ్రాం ఎట్టి స్నేహితులతో కూర్చొని, నా దారి హూసేన్ సాగరా , దుర్గం చెరువా అని మేధోమధనం చేస్తూ వుంటే, ఒక స్నేహితుడు గీతోపదేశం ప్రారంభించాడు.
నాయనా సుబ్బూ...సినిమా ఫట్ అవగానే నీ దారి హుసేన్సాగర్ దారి కాదు. పబ్లిసిటి అనే పాశుపతాశ్రం వుంది. ఈ మధ్య ఫ్లాప్ అనుకున్న సినిమాలన్నిటిని ఆదుకొనే ఒక కొత్త పబ్లిసిటి మాస్టర్ మంద క్రిష్ట్న వున్నాడు అతను కరుణిస్తే నీ సినిమా సూపర్ హిటే అని చెప్పాడు. సుబ్బు ఈ మాటలతో కాస్తా తేరుకున్నాడు. కట్ చేస్తే తరువాతి రోజు వుదయం సుబ్బు మందా ఆఫీస్ లో వున్నాడు. క్రిష్ట్న విషయం అంతా విని , చూడు సుబ్బూ, సినిమా హిట్ అవ్వాలంటే ఏదో ఒక వివాదం కల్పించి ప్రచారం చేస్తే సరి, దెబ్బకు ఎంత చెత్త సినిమా అయినా హిటయి వూరుకుంటుంది అన్నాదు. మళ్ళీ కట్ చేస్తే సాయంత్రం క్రిష్ట్న , సుబ్బు కూర్చొని సినిమా లో ని ప్రతి సీను చాలా జాగ్రత్తగా చూడసాగారు, ఒక సీన్లో నైనా , లేక ఒక డైలాగ్ లో నైనా ఏదో ఒక వివాదం కనిపిస్తుందో అని. వూ.. సినిమా మొత్తం నాలుగు సార్లు తిప్పి చూసినా అటువంటిది ఒక్కటి కూడా కనిపించలేదు. క్రిష్ట్న తన సలహాదారులు 'రాజా', జగ్గు ల సహాయం అడిగాడు. అయినా వీళ్ళు కూడా ఏమాత్రం సాధించలేకపోయారు. ఆ ఖండ ఖండాలు గా నరికిన సినిమాని అన్నిసార్లు చూసిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి మోకాలు వాచి పోయింది మందా వారికి. కాలి వాపు తగ్గటానికి చిత్తు చిత్తు గా తాగి మత్తుగా పడుకున్నాడు. నిద్ర లో పాత జ్ఞాపకాలు.. అప్పుడెప్పుడొ తను పెట్టిన ఒక కేసులో ఇంకా జ్యోతి ఎం డి ని అరెష్టు చేయకపోవటం అనే బాధ గుండెల్లో కసుక్కున గుచ్చుకుంది. ఆ ఆలోచనలతో జ్యోతి ని ఎలా ఆర్పేయాలా అని ఆలోచన ఒక వైపు, 'శనిగాడు ' సినిమాని వివాదం చెయ్యటం ఎలా అనే ఆలోచన ఒక వైపు.. అలా ఆలోచిస్తుంటే మోకాలి లో ఒక మెరుపు.. అంతే మత్తు వదల్చుకొని వెంటనే తన అనుచరులని అందరినీ పిలిచి, మెరుపు ధర్నా ని ఆదేశాలు పాస్ చేశాడు. 'శని గాడు ' సినిమా లో ని అభ్యంతరకర సన్నివేశాలు వెంటనే తొలగించి వెంటనే దళితులందరికీ క్షమాపణ చెప్పాలి అని ... 24 గంటలలో జరగకపోతే సినిమా ప్రదర్సించే హాల్ మీద దాడి చేస్తాం అని ప్రకటనలు.
తెల్లారి లేసే సరికి అన్ని పేపర్లలో హెడ్డింగులో ' మంద ' వారి అల్టిమేటం.. ఇక జనాలందరిలో కుతూహలం ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కడ వున్నాయా అని .. అలా సినిమా కి కలెక్షన్లు పెరిగాయి. 24 గంటలు గడచినా దర్శక , నిర్మాత కానీ సినిమా తరపున ఎవరూ క్షమాపణ చెప్పలేదు, సో ' మందా ' వారు అల్టిమేటం ని మరో 24 గంటలు పొడిగించారు. అలా ఒక వారం రోజులు లాగించ్గారు.. ఈ లోపు కలెక్షన్లు బాగా వూపందుకొని ఎస్ ఎస్ సుబ్బు కి ఆనందం కలిగించాయి. ఇంత జరిగినా ప్రేక్షకులు మాత్రం 'మందా ' వారి అభ్యంతరకర సీన్లు ఏవా అని బుర్రలు బద్దలు కొట్టూకోసాగారు. కొంత మందైతే ఈ సీను అభ్యంతరకం అంటె కాదు ఈ సీను అని పందేలు వేసుకోసాగారు. ఇన్ని గందరగోళాల మధ్య ' మందా ' వారు దీని మీద రోజుకో ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్నాడు. మరో పక్క పత్రికా విలేఖరులంతా 'మందా ' వారిని ఈ రోజెలాగైనా ఆ అభంతరకర సన్నివేశాల గురించి పట్టు బట్టాలని నిర్ణయించుకున్నారు. సో ప్రెస్ కాంఫరెన్స్ ప్రారంభమైంది.
వి : సార్, ఇన్ని రోజులుగా మీరు ఆందోళనలు చేస్తున్నారు, కానీ ఆ అభ్యంతరకర సన్నివేశాలు ఏవో చెప్పలేదు ?
మ : సినిమా దర్శక నిర్మాతలు తాము చెసిన తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటారని ఆశించాము. కానీ అలా చెయ్యలేదు. ఇది వీళ్ళ దురహంకారం. ఇలాంటి వాళ్ళకు మేము బుద్ది చెబుతాము.
వి : మరి ఆ సన్నివేశాలేంటొ చెబితే ...
మ : ఇలా మమ్ములని ఎన్ని రోజులు అవమానిస్తారు . .. ఇలాగే జరిగితే మేము తిరగబడే రోజు వస్తుంది....
వి : కానీ ఆ సన్నివేశాలు..
మ : సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
వి : సార్, అది ...
మా : ఆ రెండు పత్రికల అధిపతులు, విపక్షలదీ అందరిదీ దురహంకారమే.. మేము దాడులకు తెగబడతాం..
వి : సార్, కాస్తా ఆ సన్నివేశాలు వివరించండి ...
మా : మేము వీళందరి మీదా దాడి చేస్తాము.. ఎవరికీ భయపడం.. ఆనాడు గాంధీ , మళ్ళీ ఈ నాడు నేను..
వి : మీరు ఆ సన్నివేశాలు ఏంటొ చెబుతారా, సమావేశం ముగించమంటారా ?
మా : మీదీ దురహంకారమే.. మీ పేపరోళ్ళ మీద దాడి చేసినందుకు మేము గర్వ పడుతున్నాము... సర్లే చెబుతాను వినండి. ఆ సినిమా లో ఒక సన్నివేశం లో దేవుడి గుడి ముందు దీపం ఆరిపోబోతూ వుంటే హీరో, హీరో ఇన్ ఒకే సారి వచ్చి దీపం ఆరిపోకుండా చేతులు అడ్డం పెట్టారు. ఇది చాలా అభ్యంతరకరం
వి : { ఆశ్చర్యం తో నోట మాట లేదు.. }
మా : దీపం అంటే 'జ్యోతి ' .. అంటే ఆంధ్ర జ్యోతి పత్రిక.. అంటే మా మీద తప్పుడు వార్తలు రాసిన పత్రిక.. అలాంటి ఆరిపోతున్న జ్యోతిని హీరో ఆరిపోకుండా ఆపటమా.. మాకు ఇంత అవమానమా ?
వి : { అప్పటికి కాస్తా తేరుకొని } కానీ దేవుడి ముందు దీపం ఆరిపోగుండా వుంచటం లో కూడా వివాదమా ?
మా : ఆ సన్నివేశం అలాగే వుంటే తప్పులేదయ్యా.. కానీ ఆ సన్నివేశం లో ఎక్కడొ వెనకలు నిలబడిన ఒక వ్యక్తి చేతిలో జ్యోతి పేపర్ వుంది. అంటే ఈ దర్శకుడు కావాలని సింబాలిక్ గా అలా తీశాడు " అని ఆవేశం తో వూగిపోయారు మందా వారు..
ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ వైపు క్యూకు.. ఆ సన్నివేశం చూడటానికి. పాపం ప్రేక్షకులు ఎంత కన్నులు విప్పార్చుకుని చూసినా ఆ సన్నివేశం లో ఎవరో లీలగా చేతిలో పేపర్ తో కనిపిస్తున్నారే కానీ అది జ్యోతి పేపర్ అని పోల్చుకోలేక పోయారు.
అలా.. ప్రేక్షకులను వదలకుండా వెంటాడుతూ సినిమా 'శనిగాడు - పట్టుకుంటే వదలడు ' అనే పేరు సార్థకం చేసుకుంది.
మందా వారికి పెద్ద మొత్తం సమర్పించుకున్నాడు సుబ్బు.
సినిమా హిట్ అయిన ఆనందం లో సుబ్బు గారు తరువాతి సినిమా 'దరిద్రుడు - వీడికి వొళ్ళంతా అదృష్తమే ' తో రెడీ అయిపోయాడు.
పాపం తెలుగు ప్రజలు.. ఇలాంటి చెత్త సినిమాలు చూసుకుంటూ , పిచ్చి రాజకీయాలు భరిస్తూ.. కాలం వెళ్ళదీస్తున్నారు........

22 comments:

Kathi Mahesh Kumar said...

సెటైర్ అదిరింది. ఇక సినిమా టైటిళ్ళైతే యమహో! అర్జంటుగా రిజిస్టెర్ చెయ్యించెయ్యండి ఎవరైనా ఎత్తుకెళ్ళి వాడెయ్యగలరు.

ప్రపుల్ల చంద్ర said...

కడుపుబ్బ నవ్వించారు. సినిమా టైటిల్స్ అదుర్స్ !!!!

క్రాంతి said...

సూపర్!! పొద్దున్నే కళ్ళల్లోండి నీళ్ళు వచ్చేంత నవ్వించారు.టపా చాలా బాగుంది."దరిద్రుడు" సినిమా రివ్యూ కోసం ఎదురుచూస్తుంటాము మరి!

మేధ said...

హ్హహ్హ.. టపా అదుర్స్.. సినిమా టైటిల్స్ సూపర్.. దరిద్రుడు సినిమాకోసం వెయిటింగ్...!!!

సుజాత వేల్పూరి said...

ఈ టపాని మంద కృష్ణ కి పంపించే ఏర్పాటు చేద్దామంటారా! అఖిల తెలుగు బ్లాగర్లందరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటాడేమో! దీపానికి చేతులు అడ్డం పెట్టడం మీద అభ్యంతరం లాంటి వివాదాలు నిజంగా ఆయనే సృష్టించగలడు. బాగుంది సెటైరు.

సుజాత వేల్పూరి said...

ఈ టపాని మంద కృష్ణ కి పంపించే ఏర్పాటు చేద్దామంటారా! అఖిల తెలుగు బ్లాగర్లందరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటాడేమో! దీపానికి చేతులు అడ్డం పెట్టడం మీద అభ్యంతరం లాంటి వివాదాలు నిజంగా ఆయనే సృష్టించగలడు. బాగుంది సెటైరు.

Rajendra Devarapalli said...

బాగుంది.కానీ మంద కృష్ణ పేరు అన్నిసార్లు ప్రముఖంగా పేర్కొంటూ,ఈ ఉదంతం లో మిగిలిన పుణ్యపురుషులను ఎందుకు ఉపేక్షించారు?అసలు మొదటి సినిమా పేరే కంత్రి,నిర్మాత అశ్వినీదత్,హీరో జూనియర్ యన్.టి.రామారావు,దర్శకుడు చిరంజీవి పిన్ని కొడుకు మెహర్ రమేష్,రెండో సినిమా నిర్మాత రాజస్థాన్ నుండి వచ్చి ఇక్కడ సెటిలై పోయిన ఆర్బీచౌదరి,హీరో రాజశేఖర్.వీరిలో,మీ ఉద్దేశ్యం ప్రకారం,మంద కృష్ణకు ఎంత వాటా ఉందో మిగిలిన వారందరికీ అంతే వాటా ఉంది.ఇచ్చేవాడుంటే తీసుకుంటారు.అడుగుతున్నాడనీ ఇస్తారు.కాదా?మీ తర్వాతి టపాలో పై పాత్రధారులందరినీ ప్రవేశపెట్టండి వీలుంటే.

Anonymous said...

Niranjan, meeru OTIS lo ASP code maatrame kaadu blogs kuda baaga raastunnaru :-)

నిషిగంధ said...

"మోకాలిలో ఒక మైమెరుపు.." నవ్వలేక చచ్చాను.. టపా చాలా చాలా బావుంది :)

Unknown said...

కత్తి టపా... భలే సెటైరు

Anonymous said...

Good One Niranjanaa :)

Anonymous said...

lol ran jan ..

okarticle lo andarini cover chesesaaru gaa :)
good .. keep posting :)

Anonymous said...

బాగుంది......

Niranjan Pulipati said...

@ మహేష్ , చంద్ర గారు , క్రాంతి గారు , మేధ గారు - ధన్యవాదాలు. :)

@ సుజాతా గారు - మంద వారి కి ఈ టపా పంపితే, ఒక అఖిల తెలుగు బ్లాగర్లే కాదు, నేను అమెరికా లో వున్నందుకు బుష్ కూడా రిజైన్ చేసి క్షమాపణ చెప్పాలంటాడేమో.. లేకపోతే వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానంటాడు :)

@ రాజేంద్ర గారు - మిగిలిన వారిని వుపేక్షించడం లో వుద్దేశం ఏమీ లేదండీ.. ఆ ఎస్ ఎస్ సుబ్బు పాత్ర లోనే వీళ్లంతా వున్నారు..

@ అనానమస్ గారు - ధన్యవాదాలు అండి.. అర్జెంట్ గా మీరెవరో చెప్పేయండి ప్లీస్.. ఎందుకంటే నా OTIS హిస్టరి తెలిసిన వాళ్ళు అంటే ఇంఫోటెక్ వాళ్ళే అయి వుంటారు. ఇంఫోటెక్ కొలీగ్స్ పెద్దగా ఎవరూ టచ్ లో లేరు . మీ డీటైల్స్ చెబితే I will be very happy . మీ రిప్లై కోసం వైటింగిక్కడ. :)

@ నిషి, ప్రవీణ్, రాజ్ , గీతా, శివా గారు - ధన్యవాదాలు :)

కొత్త పాళీ said...

good job!
Re. Bush apologies to Mandha Krishna - actually that is not a bad idea.
ఈ అవిడియా ఏదో కొంచెం ముందే వచ్చుంటే బావుండేది. ఇప్పుడేం లాభం, బుష్ పదవీకాలం ఐపోవచ్చింది!

Anonymous said...

హన్నా! అభినవ అంబేద్కర్ మా మందా గారిని అంత మాట అంటారా...ఇది ప్రపంచ ప్రజలందరికి అగమానం! అయినా అరికాలులో వున్న మందా గారి మెదడు మోకాలిలో వుందని రాయటానికి ఎంత ధైర్యం!

వేణూశ్రీకాంత్ said...

Simply superb... movie Titles keka..

Niranjan Pulipati said...

@ కొత్త పాళి , వేణు - ధన్యవాదాలు :)

sujana said...

హీ హ హ ...బాగ రాసారు ..చాల రొజుల తరువాత ..మీరు VRIPS DIRECTOR తో ఒకానొక సందర్భం లొ సినిమా తియ్యడం అంత ఈజి కాదు sir ..అని వాదించిన సంగతి గుర్తు వచ్చి నవుకున్నా ..

chanukya said...

Simply Superb.Keep it up

Anonymous said...

బాగుంది,నిరంజన్ గారు...
త్వరలో నిర్మాతగా మారబోతున్నారా?

Niranjan Pulipati said...

@ సుజన - ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ (VRIPS Director తో వాదించటం) నాకు సరిగా గుర్తు లేదు.. వారి తో చాలా సార్లు చాలా వాదించాను కదా..
@ చాణుక్య గారు - ధన్యవాదాలు.
@ పానిపురి - ధన్యవాదాలు. నేనా నిర్మాతా.. నో చాన్స్. వేరే ఎవరైనా నిర్మాత అయితే డైరెక్టర్ గా నాకు వాకే.. :)