Wednesday, January 7, 2009
అ 'సత్యం' !!!
కోటి ఆశలతో కొత్త సంవత్సరం లో కి అడుగిడి వారం కూడా దాటక ముందే పెద్ద షాక్. మన ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతో గర్వం గా చెప్పుకొనే , దేశం లో అతి పెద్ద నాలుగో ఐ టి కంపెనిగా వెలుగొందుతున్న 'సత్యం' లోని నిజమైన సత్యాలు దేశ ఐటి రంగానికి పెద్ద షాక్. ఆర్థిక మాంద్యం పుణ్యమా ని ఇప్పటికే చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి బాగోలేకుండా ఉంటే పులి మీద పుట్ర లా ఒక మహా పతనం సాఫ్ట్వేర్ ఉద్యోగులను మరింత భయాందోళనలలోకి నెట్టేసింది.
రాష్ట్రం లో ని ప్రతి పల్లె లోనూ సుపరిచితమైన పేరు సత్యం. వూళ్ళో నిరక్ష్యరాసులైన వాళ్ళకు కూడా కంప్యూటర్స్ అంటే 'సత్యం' గుర్తొచ్చేఅంత పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీ పరిస్థితి నేదు అత్యంత దయనీయం. కొన్ని సంవత్సరాల ముందు మా వూళ్ళో నేను ఇంఫోసిస్ లో పని చేస్తున్నాను అంటే అదేంటి సత్యం లో రాలేదా అనే వాళ్ళు, ఈ సారైనా సత్యం లో చేరటానికి ట్రై చెయ్యి అనే వాళ్ళు, సిఎం తో మాట్లాడి సత్యం కి ట్రై చేద్దామా అనే వాళ్ళు చాలా మంది. అంతటి ప్రఖ్యాతులు గాంచిన కంపెని. నా కెరీర్ లో మొట్టమొదటి ఇంటర్వ్యూ కూడా సత్యం తోనే ఆ రోజు అందులో చివరి రౌండ్ లో పోవటంతో చాలా బాధ పడ్డా. ఇంత మంది కోరుకోవటం వల్లేమో గత సంవత్సరమన్నర నుండి 'సత్యం' కి పని చేస్తున్నా. గత మూడు నెలల నుండి ఏదో జరగబోతుంది అన్న అనుమానాలు కానీ ఇలా జరుగుతుందని మాత్రం కలలో కూడా ఊహించలేదు.
ఎందరికో రోల్ మోడల్ లా నిలచిన 'సత్యం' రాజు వెల్లడించిన నిజాలు తీవ్ర ఉత్కంఠకి గురి చేసాయి. రాబోయే రోజులలో ఏవిధం గా ఉంటుందో తెలియదు. క్లైంట్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగినప్పుడూ ఖచ్చితం గా కొత్త ప్రాజెక్ట్లు రావటం అనేది జరగదు. ఉన్నవి అన్నా నిలుస్తాయో లేదో తెలియని పరిస్థితి. అసలే ఆర్థిక మాంద్యం , ఎంత వెతికినా కనపడని కొత్త ప్రాజెక్ట్లు దాదాపు 47 వేల మంది ఉద్యోగులను అయోమయం లోకి నెట్టేశాయి. ఒక్క రోజులోనే 1000 కోట్లు ఇన్వెస్టర్ల సొమ్ము బూడిద పాలు, దేశం లోనే అతి పెద్ద కార్పొరేట్ కుంభకోణం. ఇటువంటి కుంభకోణం లో ఒక్క రాజు తప్ప వేరెవరి పాత్రా లేదంటే నమ్మటం కష్టమే. ఆడిటర్లకి, డైరెక్టర్ల కి, బ్యాంకులకి తెలియకుండా జరగటం అసంభవం. ఈ అనుమానానికి ఊతమిచ్చే ఒక సంఘటన రెండు రోజుల ముందే జరిగింది. సత్యం కి external ఆడిటర్స్ అయిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ మొన్న సత్యం ఆడిటింగ్స్ నుండి తప్పుకోవటం. వీళ్ళకి ఈ ఆడిటింగ్ అవకతవకలన్ని ముందే తెలిసి ఉండవచ్చేమో అందుకే తప్పుకున్నాయి అన్న అనుమానం రాక తప్పదు. ఇక బ్యాంకులలో డబ్బు లేకుండానే ఉన్నట్లు బ్యాంకులు ఎలా చెప్ప గలిగాయి ? ఇవన్ని చూస్తుంటే నిజంగానే ఇవన్నీ ఆడిటింగ్ ఫ్రాడ్స్ ఆ లేక 7000 వేల కోట్లు దారి మాళ్ళాయా అన్న అనుమానం రాక పోదు.
ఈ దెబ్బతో ఒక సత్యం ఏ కాకుండా మేటాస్ సంస్థలు కూడా సంక్షోబంలో కి కూరుకుపోయాయి. ఒక మహా సంస్థ కళ్లముందే కుప్ప కూలింది. కూలుతూ రాష్ట్ర , దేశ కార్పొరేట్ రంగానికి మాయని మచ్చని మిగిల్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐ టి కంపెని బ్యాలెన్స్ షీట్లను అనుమానంగా చూడాల్సిన పర్స్థితి. ఏదొ నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి. ఇటువంటి విషయాలను ఆదిలోనే అరికట్టాల్సిన సెబి ఇప్పుడే నిద్ర లేచినట్టు విచారణ అంటూ హడావిడి చేయటం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే.
47 వేలమంది ఉద్యోగులు, వేల కోట్ల రూపాయిలు మదుపు చేసిన ఇన్వెస్టర్ల ప్రయోజనాలు ఎలా కాపాడబడుతాయో రానున్న రోజులలో కాలం నిర్ణయించాల్సిందే.
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
so sad to read this NEWS
meeru cheppinatu auditor hand lenidhi corporate fraud cheyatam asambhavam....
hmmm..okkasaarigaa jobs emavutaayo teliyani ayomayamlo udyogulu..paapam :(
నిజమే ఒక్క రాజు గారిదే పాత్ర అంటే నమ్మలేకుండా ఉంది.
సెంటిమెంటు మీద దెబ్బకొట్టింది సత్యం. ఐటీ రంగం పరిస్థితి ముందే అంతంతమాత్రంగా, జారుడుబల్లమీద జారుతూ ఉంది. ఇప్పుడు సత్యం దెబ్బతో జారడం వేగవంతమౌతుంది.
మీరు చక్కగా చెప్పారు. రామలింగ రాజు చెప్పిన ప్రకారం.. కొన్ని సంవత్సరాల నుండి ఈ inflation in terms of income, profits, cash balances తంతు జరుగుతోంది. అంటే నివురుగప్పిన నిప్పు సత్యం అన్నమాట. ఇలా జారుతూనే ఉన్నా .. సత్యం కంపనీ కరువో, కాలమో అన్నట్లు చాలా మందిని కేంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ చేసుకొంది. మరి విచిత్రమేమిటంటే ఇంజినీరింగ్ రెండో సంవత్సరం పూర్తీ అయిన వారిని కూడా సెలెక్ట్ చేసుకొంది. వీరందరి పరిస్తితి ఏమిటి?? ప్రస్తుతం పని చేస్తున్న వారి సంగతి ఏమిటి?? పోనిలే వీరందరికీ వేరే చోట్ల ఏదో ఒక ఉద్యోగం వస్తోందనే అనుకుందాము. మరి ఎంతో డబ్బులు పోగుట్టుకున్న వారి పరిస్తితి ఏమిటి?? ఎవరు తిరిగి చెల్లిస్తారు?? ఎవరు బాద్యత వహిస్తారు?? ఎంతో మేధావులు అనబడే వారు సత్యంలో డైరెక్టర్ పదవులు వెలగబెట్టినదేమిటి?? ఏమి చేస్తున్నారు వారంతా?? నిద్ర పోతున్నారా?? జీతాలు తీసుకొని ఎవరితో కులుకుతున్నారు?? ఎవడబ్బ సోమ్మనుకొన్నారు?? మనదేశంలో ఉన్నన్ని చట్టాలు వేరే ఏ దేశాలోను లేవు. ఎందుకీ చట్టాలు?? ఎవరిని ఉద్దరించడానికి?? ఇన్ని సంవత్సారలనుండి జరుగుతున్న కుట్రని ఎందుకని కనిపెట్ట లేక పోయారు?? ఇవన్ని జవాబు లేని ప్రశ్నలు. చలికాలంలో సన్ స్ట్రోక్ అని జోకేసుకుందామా??
నేను రామలింగరాజు గారిని ముఖస్తంగా రెండు సార్లు కలుసుకున్నాను. మొదటిసారి, అయిదేళ్ళ క్రితం, హార్వర్డ్ యూనివర్శిటీలో మేమిద్దరమూ ఒకే కాన్ఫరెన్సుకి హాజరయినప్పుడూ, రెండేళ్ళ క్రితం హైదరాబాదులో ఆయన ఆఫీసులోనూ. బైర్రాజు ఫౌండేషన్ వారు ఆంధ్రప్రదేష్ లో ఉడతా భక్తిగా సత్కార్యాలు చేస్తున్నారు. మనిషి పైకి కంగ కుండా, "రాజా" లా కనిపించినా లోపల ఇంత అగ్ని పర్వతం రగులుతోందని ఎప్పుడూ అనుకోలేదు. కాగా, సత్యం ని ఎన్రాన్ తో పోల్చటం సరి కాదనిపిస్తోంది. ఎన్రాన్ అధికారుల నోటి నుండి జరిగిన విషయం ఊడబెరకటానికి విశ్వప్రయత్నం చెయ్యవలసి వచ్చింది; రాజు గారు తప్పు జరిగిపోయిందని బహిరంగంగా ఒప్పుకున్నారు. "తప్పు జరిగిపోయింది, నేను శిక్షార్హుడనే" అని ఒప్పుకున్న ఒక అమెరికన్ CEO ని చూపించండి. ఒక పక్క మనందరినీ ముంచేస్తూనే వారు మాత్రం మిలియన్లు దాచుకుని సుఖపడ్డవాళ్ళు ఎంతమంది లేరు. భోపాల్ లో జరిగిన ఆఘాయిత్యానికి Anderson మాటవరసకి "sorry" అన్నాడా? ఇదే అమెరికాలో జరిగుంటే రామలింగరాజు గారికి బదులు ఆయన లాయరు మాట్లాడి ఉండేవాడు. నేను రాజు గారిని సమర్ధించటం లేదు, అలా సమర్ధించవలసిన అవసరం కూడా లేదు. ఈ సంఘటనని మరొక కోణం నుండి చూస్తున్నాను, అంతే.
నేను ఏకీభవిస్తున్నాను. వ్యవస్థలో ప్రక్షాళణకి ఆయన ఒక అవకాశమిచ్చారు. ఆయన ఈ విషయములను బయట పెట్టకుండా ఉండి ఉంటే సత్యము కనుమరుగయ్యేది దానితోబాటు సత్యమూను. లెహమాన్ , నోర్టల్ లాంటివి విశ్వ అర్థవ్యవస్థము కలిగించిన నష్టముతో పోలిస్తే ఇది శూన్యం. భారతీయ సంస్థలకు కొత్త రూపునివ్వడానికి ఇది ఎంతైనా దోహదపడుతుంది
Post a Comment