Monday, July 23, 2007

భారతీయ ఐటి కంపెనీల వింత పోకడలు !!!

ఈ వీకెండు నా పాత ఇంఫోసిస్ కొలీగు తో మాట్లాడుతుంటే ఈ ఇండియన్ కంపెనీల పైన ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ ఆధారం గా ఈ మధ్య ఈ కంపెనీల వింతపోకడలు, వుద్యోగులను వేధిస్తున్న తీరు గురించి ఒక ఆర్టికల్ రాద్దామనిపించింది.నేను ఇంఫోసిస్ లో 2003 నుండి 2006 వరకు చేసాను. 2002 వరకు ఇంఫోసిస్ లో పని చేయటం నా స్వప్నం. ఆ స్వప్నం నిజమైన రోజు ఎంత ఆనందించానో అనుభూతిలో చెప్పలేనిది. అలాంటి ఆనందం ఆవిరవటానికి ఎన్నో రోజులు పట్టలేదు. మీడియాలో వచ్చే వార్తలు, కంపెని పైన వచ్చే రకరకాల పొగడ్తలు అన్నీ పబ్లిసిటి గిమ్మిక్కులు అని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టలేదు.
ఈ కంపెనీ ఎప్పుడూ విలువల గురించి మాట్లాడుతుంది. ఈ విలువలు , నిజాయతి మాటలు కేవలం చెప్పటానికే. కంపెని లోగుట్టు వుద్యోగులకు మాత్రమే ఎరుకు. ఇక్కడ గత సంవత్సరం జరిగిన ఒక సంఘటన వివరిస్తా. 2006 మొదట్లో నేను ఈ కంపెనీ తరపున లండన్ లో ఒక క్లైంట్ దగ్గర పని చేస్తున్నా. మా స్నేహితుడు ఒకతను 2 సంవత్సరాలు ఆ క్లైంట్ దగ్గర పని చేసి ఇండియా కి తిరిగి వెళ్ళుతున్నాడు. మా క్లైంట్స్ మా తో చాల క్లోస్ గా వుండే వాళ్ళు. అలా మాతో సరదాగా మాట్లాడుతూ మా ఫ్రెండుని సో నువ్వు బిజినెస్ క్లాసులో ప్రయణిస్తున్నావా ? అని అడిగాడు. మా ఫ్రెండు అదేమీ లేదు మామూలు ఎకానమీ క్లాస్ లోనే అని అన్నాడు. అందుకు వెంటనే క్లైంట్ బాగా హర్ట్ అయ్యినట్టనిపించి వెంటనే ఆ నెల సైను చేసిన బిల్లు తీసి చూపించి, మీ కంపెనీ బిజినెస్ క్లాస్ కి బిల్ చేసింది.. యౌవర్ కంపెని ఈజ్ చీటింగ్ , థిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అని అన్నాడు. మాకందరికీ తల కొట్టేసినట్టైంది. ఇంత జరిగిన తరువాత విషయం మ్యానేజరు దృష్టికి తీసుకువెళ్ళితే మ ఫ్రెండు నే తప్పు పట్టారు అలా ఎందుకు చెప్పావు.బిజినెస్ క్లాస్ లో నే ప్రయాణం చేస్తున్నానని చెప్పాలి కదా అన్నారు. అసలు వుధ్యోగులకు విషయం తెలిస్తే కదా.. ఇలా ఫ్లైట్ టికెట్ల విషయం లో కూడా కంపెని కక్కుర్తి పడుతుందని. ఇటువంటీ కంపెని నా విలువల గురించి మాట్లాడేది.
ఇక ఈ కంపెనీలన్ని చేసే మరో గిమ్మిక్కు వేరియబుల్ సేలరీ. కంపెని పని తీరు ఆధారంగా ఇచ్చే వేతం అని పేరుకి.. కంపెనీ ఎంత గొప్ప పని తీరు కనబరచినా అందులో పాతిక శాతం కన్నా ఎక్కువ వేతనం ఇవ్వరు. ఏమంటే రకరకాల సాకులు చెబుతారు. గత 5 లేక 6 సంవత్సరాలలో ఎన్నడు కంపైనీ పనితీరు ఆధారిత వేతనం 50 శాతం మించలేదంటే కంపెనీ ఎంత మోసం చేస్తుందో తెలుసుకోవచ్చు. (ఇక్కడ గమనించాలసిన అంశం ఏంటంటే ప్రతి సంవత్సరం కంపెని మార్కెట్ ను మించిన గొప్ప ఫలితాలని చూపించింది).
ఇక ఇప్పుడు మరిన్ని వింత పోకడలకు పోతుంది ఈ కంపెని. కంపెని నుండి వుద్యోగులు రాజీనామా చేస్తే, 6 నెలల వరకు ఈ కంపెనీ ప్రత్యర్థులు ఎవరి దగ్గరా పని చేయకూడదని కొత్త మెలిక. (అందులో చాలా స్పష్టం గా పేర్కొన్నారు, విప్రో ,టిసియెస్ , లాంటి కంపెనీ లలో చేరకూడదని. ) ఇంతకన్నా దారుణం వుంటుందా చెప్పండి ?
ఇప్పుడు రూపాయి విలువ బలపడుతుందని, లాభాలు తగ్గుతున్నాయని, వుద్యోగుల చేత పని గంటలు పెంచాలని ప్రతిపాదిస్తోంది (వారానికి 40 గంటల నుండి 50 గంటలకు పెంచాలని ) . ఇదే కంపెని భారీ గా లాభాలు వచ్చినప్పుడు వుద్యోగులకు ఏమి ఇచ్చింది ?
ఈ విషయం పైనా మీ విలువైన అభిప్రాయాలు కూడా పంచుకోండి..

8 comments:

Anonymous said...

ఇన్ఫీ నాకు తెలిసినంత వరకూ ఒక మేడిపండు. అతి భయంకరమైన అనుభవాలు నేను నా స్నేహితుల ద్వారా విన్నాను. అందులో కొన్ని...

01. అర్ధ రాత్రిళ్లు, వేకువ జాముల ఇంటికి వెళ్ళడాలు అతి సాధారణం
౦౨. ఎక్కువ శాతం మంది వుద్యోగులు కాలేజీ నుంచి ఎకా ఎకీన ఇక్కడికి వచ్చి పనిచేస్తూ వుండటం వలన ఎమోషనల్ ప్రొఫెషనాలిటీ చాలా తక్కువ. చిన్న చిన్న విషయాలకు అతిగా స్పందించటం, మెచ్యూరిటి లేని మెయిళ్ళు సర్వ సాధారణం.
౦౩. జిమ్ వున్నది మీడియా హైప్ కోసమే...సాయింత్రం అయిదు తర్వాతనే ఎవరినైనా అనుమతించేది(ఎంత వరకు నిజమో తెల్వదు)
౦౪. జీతాలు కూడా పెంచేది భట్రాజులకే
౦౫. ఇంటర్నెట్ ప్రపంచం కొద్ది మందికే సొంతం

ఇలా చాలా వున్నాయి.

ప్రదీపు said...

అభిప్రాయాన్ని పంచుకోమంటున్నారు కాబట్టి చెబుతున్నాను. ఇలా కంపెనీ చేసే పనులు మీకు నచ్చకపోతే ఆ విషయాన్ని చెప్పి వెంటనే ఆ కంపెనీకి రాజీనామా చేయాలి.

మీరు మీ బ్లాగులో పేర్కొన్న అన్ని విషయాలు మీరు అనుభవించో, లేక ఎవరో చెబితే వినో రాసుంటారు. కానీ ఇక్కడ మీరు పేర్కొన్న ఏ ఒక్క దానినయినా నిరూపించటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా?

వ్యక్తిగతంగా నాకు కూడా మీరు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది, కానీ ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు మన దగ్గర తగిన సాక్ష్యాలు ఉండలి అని అనుకుంటున్నాను.

గమనిక: నాకూ infosysకు ఎటువంటి సంభందం లేదు.

Chandra said...

ఆసక్తికరంగానే ఉన్నా, కొత్త విషయమేమీ కాదు ఇది. చాలా కంపెనీలు అనుసరించే పద్దతే ఇది. క్లయింట్ వద్ద నుండి వీలైనంత డబ్బులు దండుకోవడమే కాదు.. కంపెనీలో ఇతర చోట్ల వీలైనంత డబ్బులు మిగుల్చుకోవడం కూడా ముఖ్యమే వీరికి. Transparency అనేది ఉత్తుత్తి పదమే ఈ కంపెనీల్లో. ఏమీ అనలేని అమాయక అసహాయ ఉద్యోగులు ఉన్నంత కాలం ఇది ఇలా సాగుతూనే ఉంటుంది.

Bhãskar Rãmarãju said...

ప్రదీపు బ్రదరు
రాజీనామా చెయ్యటం అంతవీజీ కాదు. జాబు సెక్యూరిటీ అనేది ముఖ్యం అని నా 10 సం!! అనుభవమ్లో నేర్చుకున్న. ఇలాంటివి ప్రతీ సంస్థలోనూ ఉండేవే. సూసీసూడనట్టు పోవటమే కొన్ని కొన్ని సార్లు నయం. బల్ల మీదకుర్చోవటంకన్నా నవరంధ్రాలు మూసుకోవటం మిన్న!!

Niranjan Pulipati said...

ప్రదీప్ గారు , ఇక్కడ చెప్పినవి అన్ని నేను స్వయానా అనుభవించినవే.
నిజమే మీరన్నట్టు ఇవి అన్ని వాళ్ల ముఖాన్నే చెప్పి రాజీనామా చేసి పడేశాను..
ఇక సాక్ష్యాలంటారా ? ఎమి లాభం సాక్ష్యాలు సేకరించి ? కేసు వేద్దామంటారా ? ఇంఫోసిస్ వాడికి దేశం లొనే అత్యుత్తమ లాయర్ టీం వుంది అని విన్నాను. ఇక ఈ సాక్ష్యాలతో ఏమి సాధిస్తాము ?

Kesari said...

అయిదు రోజుల జీవన విధానం అలవాటు చేసి0దే...ఈ కంపనీ లు.. ఇప్పుడు... మళ్ళీ... మారుద్దామనుకుంటే....ఉద్యోగుల అసహానినికి ఇక అంతు ఉండదు..

Unknown said...

మీరు ఇందులో చాలా నిజాలే చెప్పరు.ఇవే కాదు ఇలాంటివి చాలనే ఉన్నాయి....ఇలంటి కంపనిలల్లో జాబ్ రాగానే మొదట చాలా సంతొషంగా ఉంతుంది వెళ్తేనే గాని తెలియదు...బెంచ్ అని అది ఇది ఇంకా చల ఉన్నయండి

Unknown said...

మీరు ఇందులో చాలా నిజాలే చెప్పరు.ఇవే కాదు ఇలాంటివి చాలనే ఉన్నాయి....ఇలంటి కంపనిలల్లో జాబ్ రాగానే మొదట చాలా సంతొషంగా ఉంతుంది వెళ్తేనే గాని తెలియదు...బెంచ్ అని అది ఇది ఇంకా చల ఉన్నయండి