Friday, October 5, 2007

హిప్నాటిజము నా నటన

అవి నేను 10 వ తరగతి చదివే రోజులు. అప్పుడు హార్సిలీ హిల్స్ లో నవోదయ లో చదువుతున్నా.. మాకు తరువాతి రోజు చిత్తూర్ లో ఎన్ టి ఎస్ ఇ (నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జాం) ఉంది అప్పటికి మూడు రోజుల నుండి అందరం బాగా చదువుతున్నాము. ఇక రేపు వుదయం బయలుదేరాలి. అప్పుడు మా టీచర్లు ఎవరో ఒక హిప్నాటిస్టు ని పట్టుకొచ్చారు. హిప్నాటిజం ద్వారా జ్ణ్జాపక శక్తి బాగా పెరుగుతుంది అని చెప్పి అందరినీ గ్రౌండ్ లో కూర్చో బెట్టారు. ఆ వచ్చినతను ఒక గంట సేపు ఏదేదో సోది చెప్పాడు. హిప్నాటిజవల్లా లాభాలు దాని శక్తి అని చెప్పసాగాడు. ఒక పక్క మాకు సాయంత్రం గేంస్ టైం అవుతోంది. అప్పట్లో ఒక రోజు క్రికెట్ ఆడ్కపోయినా ఏదో పోగొట్టుకున్న ఫీలింగు. అంతా చెప్పిన తరువాత ఇక కొంతమంది ని హిప్నటైజ్ చేస్తానని చెప్పాడు. హిప్నటైజ్ అయితే ఎలా వుంటుందో అన్న కుతూహలం తో నేనూ ముందుకు వెళ్ళా ఏదో సరదాగా ఉంటుంది అని అలా ఒక 10 మందిని తీసుకొని ఒక్క చోట నిలబెట్టి హిప్నటైజ్ చేయసాగాడు. స్కూల్ లో ని మిగతా అందరూ చూస్తూ ఉన్నారు. సినిమాలలో చూపినట్టుగానే కళ్ళు మూసుకోండి ఇప్పుడు మీకు నా మాటలు మాత్రమే వినపడతాయి అని ఏదేదో చేప్పుతున్నాడు. ఎంతసేపటికీ నేను హిప్నటైజ్ కాలేదు. అది నాకు తెలుస్తూనే ఉంది. పక్కన వాళ్ళందరూ బాగా నే నటించేస్తున్నారు (ఏమొ మరి వాళ్ళంతా నిజం గానే హిప్నటైజ్ అయ్యారో లేదో తెలియటం లేదు, చూడటనికి మాత్రం అయినట్లే కనిపించారు ) ఇక లాభం లేదని నేనూ నటన ప్రారంభించా. మొదట్లో కాసేపు బాగానే ఉంది. ఈత కొడుతున్నట్లు , మహాభారతం లో ధుర్యోధనుడి మయసభ సీను లాంటివి చెయ్యించాడు. ఆ మయసభ సీను నైతే ఒక సారి ఎవరి కాలో తట్టుకొని ఆల్మోస్ట్ పడబోయాను. ఆ తూలటం కూడా మయ సభ ఎకపాత్రాభినయం నటనకి బాగానే తోడైంది. ఇక ఆ తరువాత అందరికీ ఒక్కొక్క పచ్చి మిర్చి ఇచ్చి ఇప్పుడు మీ చేతులలో మంచి మైసూర్ పాక్ ఉంది తినమన్నాడు. ఇక చూసుకోండి. చేతిలో ఉన్నది పచ్చి మిర్చి అని తెలుస్తోంది.. తింటె నోరు మండుద్ది , తినకపోతే నటిస్తున్నాము అని తెలిసిపోతుంది. అసలే ఆడపిల్లమ పరువు ప్రతిష్టల విషయం అయ్యే. ఏమైతే అది అయింది అని వెంటనే నోట్లో పెట్టుకొని తినేసా. తింటుంటె అతను అన్నాడు. ఇప్పుడు స్వీట్ తినటం వల్లా మీ నోటికి తీపు తెలుస్తుంది అని.. ఒక్క పక్క నోరు మండుతుంటే తీపి తెలుస్తుంది అంటాడె ఈ వెధవ అని మనసులో తిట్టుకొని నోట్లో మంట తెలియకుండా నటిస్తున్నా. (అంతా అయినతరువాత తెలిసింది.. నేను ఒక్కడే మిర్చి పూర్తిగా తిన్నాను అని. మిగతా అందరు కొద్దిగా తినో లేక అసలు తినకుండానే పడేసారు అని.) నా యాక్టింగు చూసి నేను నిజం గానే హిప్నటైజ్ అయ్యానేమోననుకున్నాడు ఆ వచ్చినాయన. సో తను వచ్చి నన్ను ఒక పక్క కు తీసుకువచ్చి నీకు నచ్చిన హీరో హీరోఇన్ చెప్పమన్నాడు.. చిరంజీవి , సుహాసిని అని చెప్పా. సరే ఇప్పుడూ నీకు చిరంజీవి సుహాసిని ల ఒక మంచి పాట వస్తోంది డ్యాన్సు చెయ్యి అన్నాడు. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయను అనుకుంటూ అంతకు ముందు వారమే రాక్షసుడు సినిమా చూసి ఉండటం తో ఏదో ఒక పాటని వూహించుకొని ఎలాగో లాగా ఒక నాలుగు స్టెప్పులు వేసా. అయిపోయింది కదా అనుకుంటుంటే ఇప్పుడు ఇంఖొ ముఖ్యమైన ది, హిప్నాటిజం వల్లా మీకు తెలియకుండా నే మీలో ఎంతో బలం వస్తుంది అని చెప్పి, నన్ను తీసుకెళ్ళి రెండు కుర్చీల మీద పడుకో బెట్టాడు. (పడుకోవటం అంటే కుర్చీ ఒక అంచు మీద మెడ పెట్టి, మోకాళ్ల నుండి కింద ఇంకో కుర్చీ మీద.) సో మిగిలిన బాడి మొత్తం గాలి లో నే ఉంది.. నాకు ఒకటే టెన్షను ఏమి చేస్తాడో అని.. తరువాత చూసే వాళ్ళ లో నుండి ఒక్కరిని పిలచి నా తొడల మీద నిలబడమన్నారు. ఇక చూస్కోండి నాకు భయం మొదలైంది.. మా టిచర్లు కూడా ఇది వద్దు అని ఆ హిప్నాటిస్టు తో చెప్పారు. అయినా ఏమీ కాదని చెప్పి ఆ అబ్బాయిని నా పైన నిలబెట్టారు.. నిలబడగానే పెద్దగా కష్టం అనిపించలేదు కానీ.. ఎలాగో కొద్దిసే మ్యానేజ్ చేసాను. ఆ నీబెట్టిన వాడిని వెంటనే దించకుండా అందరి చేతా చపట్ట్లు కొట్టించి మళ్ళి సోది చెప్పసాగాడు. ఎలా ఐతే నేమి ఒక నిమిషం తరువాత ఆ అబ్బాయి ని దించి వేసి మళ్ళీ హిప్నటైజ్ నుండి బయటకు తెచ్చాడు (బయట తెచ్చాడు అని ఆయన అనుకున్నాడు :) ) హమ్మయ్య బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు.. మనకెందుకూ హిప్నాటిజం లు అనుకొని వెల్లి అందరితో కూర్చున్నా.. ఇక నెక్స్ట్ రోజు ఎగ్జాం అయ్యి రిటర్న్ వచ్చేటప్పుడు అంతా అదే టాపిక్కు.. మా టిచర్లు అంతా హిప్నాటిజం గురించి తెగ గొప్పలు చెబుతున్నారు. వెంటనే మా క్లాస్ లో ఒక అమ్మాయి ( ఈ అమ్మాయి కూడా హిప్నటైజ్ అవబడ్డ గ్రూప్ లోనిదే..  ) కూడా నిజం గానే హిప్నటైజ్ అయ్యింది అని తెగ హుషారు గా చెప్పసాగింది. ఇంకా నన్ను వుదాహరణ గా తీసుకొని హిప్నాటిజం వల్లా ఎంత బలం వస్తుందో అని చెప్ప సాగింది. హు.. ఇలా అందరూ హిప్నాటిస్టు ని తెగ పొగిడేస్తుంటే మన యాక్టింగు స్కిల్ల్సు మూల పడిపోతాయని పించి , ఇంకా ఎదో ఒకటి చెప్పాలనిపించింది.. వెంటనే నెగటివ్ రంగులో ఫ్లాష్ బాకు చిత్రాలు కళ్లముందు కదిలాయి.. (చితూర్ జిల్లా నవోదయ లో మాదే మొదటి బ్యాచ్.. 6 వ తరగతి నుండి ప్రారంభమైయ్యాయి అక్కడ మా చదువులు . అక్కద చదువు తో పాటు సాంస్కౄతిక కార్యక్రమాలలో కూడా బాగా శిక్షణ ఇప్పించే వారు. మాకు ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా అప్పుడప్పుడు వచ్చి నేర్పించే వాడు. ఆ మాష్టర్ నాకు ఒక కోయదొర ఏకపాత్రాభినయం నేర్పించాడు.. దానిని ఎప్పుడూ మా టీచర్ల ముందు క్లాస్ వాళ్ల ముందు మాత్రమే ప్రదర్శించటానికి అవకాశం దొరికేది.. అప్పట్లో మా స్కూల్ కి కలెక్టర్ ఇంకా కొంత మంది వి ఐ పిలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే వారు. ఆ వచ్చినప్పుడ కొన్ని సార్లు మా సాంస్కౄతిక కార్యక్రమాలు వుండేవి.. కానీ ఎప్పుడూ నా ట్యాలెంట్ చూపించే అవకాశం వచ్చేది కాదు.. సరే ఎప్పటికైనా ఆ 'ఒక్క చాన్సూ రాకపోతుందా అని ఎంతో ఎదురు చూసాను.. ఆ అవకాశం ఒక రోజు రానే వచ్చింది.. మా స్కూల్ డే రూపం లో.. ఆ సంవత్సరం చాలా ఘనం గా జరపదలచి నా ఏకపాత్రాభినయం కూడా కార్యక్రమాలలో చేర్చారు.. కానీ విధి బలీయమైనది కదా.. ఎమైందో ఏమో చివరి నిమిషం లో నా నా ఏకపాత్రాభినయం తీసేసి.. టైం సరిపోదు అని సాకు చెప్పారు.. నిజమేమో అనుకొని సరిపుచ్చుకొని ఆ రోజున కార్యక్రమాలన్నీ చూస్తున్నాము. ఇంతలో ఈ అమ్మాయి కోయదొర ఏకపాత్రాభ్జినయం అని మైకు లో వినగానే నా మైండ్ లో వేయి టన్నుల బాంబు.. నాకేమో టైం సరిపోదని చెప్పి సేం అదే కాన్సెప్టు ని వేరే వాళ్లతో వేయించటం తో ఆ రోజు అదేదో శపధం చేసేసా.. ఇక ఆ కోయదొర ఏకపాత్రాభినయం చెయ్యను.. కానీ ఏదో ఒక రోజు నా నటనా చాతుర్యం వీళ్ళకు చూపించాలని )

సో ఫ్లాషు బాకు నుండి బయట వచ్చి.. ఎన్నాళ్లకు దొరికావు.. నా అవకాశన్ని గద్దలా తన్నుకు పోతావా అని ఒక విలన్ నవ్వు నవ్వుకొని మనలో అసూయాపరుడిని నిద్ర లేపా. హిప్నాటిజం లేదు ఏమీ లేదు నేను అలా నటించా అంతే మిర్చి ఇవ్వటం అది స్వీట్ అని చెప్పినా నాకు మిర్చి అని తెలిసే తిన్నా అని , ఇంకా అక్కడా జరిగినవన్నీ చల్లగా చెప్పేసాను..:)) అంత సేపు తెగ లెక్చర్లిచ్చిన వాళ్ళతా ఏమి మాట్లాడలో తెలియక నోరెళ్ళబెట్టారు :) పెడితే పెట్టారు గాని.. ఆ రోజు తో అందరూ నా యాక్టింగు స్కిల్సుని గుర్తించారు.. :) ఇంకా టాలీవుడ్ గుర్తించడమే మిగిలి వుంది..

2 comments:

నిషిగంధ said...

ఈ జ్ఞాపకం ఇదివరకు విన్నట్టు లేదు.. బావుంది :-)

రానారె said...

Hilarious! ఏదో ఒక రోజు తప్పకుండా మీరు గొప్ప నటులౌతారు బాబు ... తప్పకుండా అవుతారు ... ;)